MLC Jeevan Reddy: చైనా, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా కోరుట్ల జీఎస్ గార్డెన్ లో నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 1971లో దాయాది దేశం పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ మెడలు వంచింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బంగ్లాదేశ్ దేశాన్ని విభజన చేయకుండా ఉంటే పాకిస్తాన్ మన పక్కలో బల్లమై ఉంటుండే అని తెలిపారు. పాకిస్తాన్ ను ముక్కలు చేసి బంగ్లాదేశ్ తలెత్తకుండా రక్షణ ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ అని పేర్కొన్నారు.
Read Also: BRS: వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్..
Also Read
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
- Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
- Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
2018 డిసెంబర్ లో పిలవని పేరంటానికి పోయి నవాజ్ షరీఫ్ తో మోడీ షీర్ కుర్బత్ తిని వచ్చిండని జీవన్ రెడ్డి విమర్శించారు. దేశం కానీ దేశానికి ఎందుకు వెళ్ళాడని దుయ్యబట్టారు. చైనా, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఇందిరాగాంధీ దయతోనే మోడీ ప్రధాని అయ్యాడని.. పాకిస్తాన్ పై యుద్ధం గెలిచిన తర్వాత లోక్ సభలో ఇందిరాగాంధీని అపర దుర్గాదేవితో పోల్చిన వ్యక్తి వాజ్ పాయ్ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: CM Jagan: ఆరోజే సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్..!?
ఇదిలా ఉంటే.. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ దూకుడు ప్రదర్శించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..