Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
- ఎమిరేట్స్ హైవేపై మినీ బస్సు-లారీ ఢీకొన్న ఘటన
- మొత్తం ఏడుగురు వలస కార్మికులు దుర్మరణం
- జగిత్యాల జిల్లా మూడు కుటుంబాల్లో విషాదం
- మృతదేహాల తరలింపునకు భారత కాన్సులేట్ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dubai Road Accident: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన జగిత్యాల జిల్లా బిడ్డలను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. దుబాయిలోని ఎమిరేట్స్ రహదారిపై జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదంలో మొత్తం ఏడుగురు వలస కార్మికులు మృతి చెందగా, వారిలో ముగ్గురు జగిత్యాల జిల్లాకు చెందిన వారు కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. షార్జాలోని ఒక అల్యూమినియం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా విధి నిర్వహణలో భాగంగా మినీ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎమిరేట్స్ హైవేపై ఒక లారీ సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోగా, వేగంగా వస్తున్న కార్మికుల మినీ బస్సు ఆ వాహనాన్ని వెనుక నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద ధాటికి మినీ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయి అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటనలో జగిత్యాల రూరల్ మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం, తక్కళ్ళపల్లికి చెందిన తిరుపతి గౌడ్, , మెట్పల్లి పట్టణానికి చెందిన అబ్దుల్ రఫీఖ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురు కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
విషయం తెలిసిన వెంటనే దుబాయిలోని భారత కాన్సులేట్ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు సేకరించిన అధికారులు, మృతదేహాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన చట్టపరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లిన కుటుంబ యజమానులు ఇలా శవాలై వస్తున్నారనే వార్త వినడంతో జగిత్యాల జిల్లాలోని ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, ప్రభుత్వం త్వరగా స్పందించి మృతదేహాలను రప్పించాలని, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..