నాకు హుజురాబాద్ నియోజకవర్గం ఉందని, ఒకవేళ పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీకి సిద్ధమని ఈటల రాజేందర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. ధాన్యం విషయంలో కేసీఆర్ తన వైఫల్యాన్ని కేంద్రం పై మోపుతున్నాడని ఈటల అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వాళ్ల మంత్రుల మాటలను తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితిలో లేదన్నారు. ఇంత నీచంగా హరీష్‌రావు ప్రవర్తిస్తారని తెలంగాణ ప్రజలకు తెల్సింది. ప్రాంతీయ పార్టీల్లో వారసులే సీఎంలు అవుతారు. బీజేపీ ఎవ్వరిని ప్రలోభపెట్టదు. టీఆర్‌ఎస్‌లో కూడా ఎవ్వరూ తృప్తిగా లేరు. ఆపార్టీకి భవిష్యత్ లేదని పార్టీ నేతలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అన్ని రకాలుగా ఆలోచించుకున్న తర్వాత నే బీజేపీలోకి చేరానని తెలిపారు.
Also Read: వీళ్లు మామూలు ముదుర్లు కాదు.. ఏకంగా న్యాయస్థానాన్నే…!
మిత్ర వైరుధ్యం ఎలా పెట్టాలో సీఎంకు వెన్నతో పెట్టిన విద్య, నేను పార్టీ మారుతాననేది అబద్ధమన్నారు. మంత్రిగా కాకున్నా మనిషిగా గుర్తించమని అడిగా … సీఎం పదవి ఎప్పుడు ఆశించలేదు. తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనేది ఊహజనిత ప్రశ్న అని ఆయన అన్నారు. నాకు సంజయ్ మధ్య పోటీ ఏమి లేదు…. ఇక్కడ ఏమన్నా సీఎం, మంత్రి పదవులు ఉన్నాయా… నేను ఎప్పుడు గ్రూపులు కట్టలేదన్నారు. ఎన్టీఆర్ ను కూడా అధికారంలోకి రారు అన్నారు…ప్రజల్లో నుండే నాయకులు పుట్టుకొస్తారు… వారే చరిత్ర నిర్మాతలు.. ధరణి ఒక లొసుగుల పుట్ట.. ధరణితో నష్టాలే ఎక్కువ ఉన్నాయని ఈటల రాజేందర్ అన్నారు.