కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం కేసీఆర్ నీవల్ల కాదు కదా! మీ తాత వల్ల కూడా కాదు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నీలాంటి కేసీఆర్ లను వందల మందిని కాంగ్రెస్ చూసింది.. నిన్నే మూడు చెరువుల నీళ్లు తాపించి మూడు నెలల్లో బంగాళాఖాతంలో ముంచుతాం.. ఇక కాస్కో ఖబర్దార్ అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ముందు నువ్వు ఎంత? నీ కొడుకు ఎంత? నీ అల్లుడు ఎంత? కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కితే ఆ అడుగుల శబ్దానికే మీరు చస్తారు. అడ్డగోలుగా మాట్లాడటం మానుకో అంటూ భట్టి కేసీఆర్ పై మండిపడ్డారు.
Also Read : Beautician : వ్యాపారంలో లాభాలు తెప్పిస్తానని లైంగికదాడి చేశాడు
కందకం నుంచి ఎలుక బయటకు వచ్చినట్టు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే అడ్డగోలుగా మాట్లాడుతుండు అని భట్టి అన్నారు. దొరల ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కేసిఆర్ గ్రహించాలి.. పోలీసు రాజ్యంలోని పాము పడగ నీడలో భయం భయంగా బతుకుతున్న ప్రజలకు నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ విముక్తి కల్పిస్తుందన్నాడు. 10 ఏళ్లుగా భయపెట్టి తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. చేసిన గ్రామ అభివృద్ధి పనులకు సైతం బిల్లులు ఇవ్వకుండా సర్పంచులను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందన్నాడు. ప్రశ్నిస్తే కేసులు బెదిరింపులు అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్నా అనుమానం కలుగుతుంది.
Also Read : AP CM Jagan: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై సీఎం జగన్ సమీక్ష
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని.. దొరల ప్రభుత్వం వద్దని ప్రజలే ప్రజా ప్రభుత్వం తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ 10 ఏండ్ల పాలనల్లో తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదు.. రుణమాఫీ కాలేదని రైతులు, ఇండ్లు, పింఛన్లు రాలేదని పేదలు, కొలువులు రాలేదని నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు అని భట్టి విక్రమార్క అన్నారు. అచ్చంపేట మండలం కొర్రతండాలో ఇండ్లకు మీటర్లు బిగించకపోయిన అడ్డగోలుగా కరెంటు బిల్లులు వేసి దోపిడీ చేస్తున్నా.. ఈ సర్కార్ కు బుద్ధి చెప్పడానికి ఊరికి ఊరే సిద్ధమైంది. ఈ ఊరు మాదిరిగానే రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఏకమవుతున్నాయి.
Also Read : Hyderabad: రాజధానిలో రెచ్చిపోయిన దొంగలు.. చోరి చేసి.. మహిళను చంపారు
2023- 24లో అఖండ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గత వారం రోజులుగా అచ్చంపేట నియోజకవర్గంలో కధం తొక్కుతున్న ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తాం.. ఇంటి స్థలాలు లేని పేదలకు భూమి కొనుగోలు చేసి ప్లాట్లు చేసి ఆ ప్లాట్ లలో ఇళ్లను కట్టిస్తాం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా 1250 రూపాయలకు పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ను కేవలం 500 రూపాయలకే అందిస్తాము అని భట్టి విక్రమార్క అన్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అమ్మ హస్తం పథకం తీసుకొచ్చి తొమ్మిది రకాల నిత్యవసర సరుకులను చౌక ధరలకు పంపిణీ చేస్తామన్నారు.
Also Read : Top Headlines@1PM: టాప్ న్యూస్
రుణమాఫీ అమలు చేయకుండా.. ఆరుగాలం కష్టపడి పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దగుల్బాజీ సర్కార్ అంటూ రైతులు తిడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని భట్టి అన్నారు. నిరుద్యోగ, విద్యార్థులకు రెండు లక్షల కొలువులు భర్తీ చేయడంతో పాటు అప్పటివరకు 4 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము.. ఐటీడీఏ ప్రాజెక్టులను బలోపేతం చేయడమే కాకుండా ఇందిరమ్మ రాజ్యంలో రుణాలు ఎలా ఇచ్చామో అలా ఇచ్చి అన్ని రంగాల్లో గిరిజనుల అభివృద్ధి చేస్తాం.. సోనియా గాంధీ తీసుకు వచ్చిన ఉచిత నిర్బంధ విద్యా చట్టం నూటికి నూరు శాతం అమలు చేయడంలో భాగంగా కేజీ టూ పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తామని భట్టి అన్నారు.