హైదరాబాద్ లోని హయత్‌నగర్ పోలీస్ స్టోషన్ పరిధిలో దారుణం జరిగింది. అర్థరాత్రిపూట దోపిడి దొంగలు ఓ మహిళ ఇంట్లో చొరబడి హత్య చేయడం కలకలం రేపుతోంది. తొర్రూరు గ్రామంలో సత్తమ్మ అనే మహిళ ఇంట్లోకి ఆదివారం రాత్రి దుండగులు ప్రవేశించారు. ఆమెను విచక్షణా రహితంగా కొట్టి హతమర్చారు. అనంతరం ఆమె వద్ద ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం వనస్థలిపురం ప్రశాంత్ నగర్ నుంచి తన కొడుకు ఆమె ఇంటికి వచ్చాడని.. రాత్రి 11 గంటల వరకు కూడా తన కొడుకుతో మాట్లాడినట్లు సమాచారం.
Also Read : Top Headlines@1PM: టాప్ న్యూస్
అయితే సోమవారం ఉదయం ఇంటి తలుపులు తీసి ఉన్నప్పటికీ సత్తమ్మ కనిపించకపోవడంతో స్థానికులు ఆమె ఇంట్లోకి వెళ్లారు. సత్తమ్మ తలకి గాయమై రక్తపు మడుగులో ఉండటాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో ఆమె అప్పటికే మృతి చెందిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దోపిడి చేసి ఈ దారుణానికి ఒక్కరే పాల్పడ్డారా లేదా ముఠా ఏదైన ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read : Cm Kcr: భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
విషయం తెలుసుకున్న సత్తెమ్మ కుమారుడు సంరెడ్డి బాల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరు అయ్యాడు. ఎన్టీవీతో మాట్లాడుతూ.. మా ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారం దోపిడీ చేయలేదు.. కానీ మా అమ్మ మెడలోని బంగారం, చేతికి, కాళ్లకు ఉన్న కడియాలు దొంగిలించారు అని చెప్పాడు. మా ఇంటి రెండు తలుపులు బ్రేక్ చేయలేదు.. ఎవరో పిలిస్తేనే మా అమ్మ తలుపులు తీసినట్టు కనిపిస్తుంది.. ఇధి తెలిసిన వారి పనే.. బంగారం తీసుకుని.. మా అమ్మను వదిలేయాల్సింది.. నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి అని సంరెడ్డి బాల్ రెడ్డి అన్నారు.