తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా చలి తీవ్రత కాస్త తగ్గిడంతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరిగింది. ఇక.. అక్టోబర్ నెలలో చూస్తే పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ నెలలోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో.. ఉదయం పొగ మంచు కురుస్తుంది.