Hyderabad Traffic: ఫుట్ పాత్‌ల మీద విక్రయాలు జరుపుతున్నారా? అలా ఆక్రమించుకుంటే కఠిచర్యలు తప్పవంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. వీరిపై కేసులు బుక్ చేసేందుకు కూడా వెనకాడటం లేదు. ఫుట్ పాత్ ను ఆక్రమించుకుంటే ఇకమీదట కఠిన చర్యలే అంటున్నారు. ప్రధాన రోడ్ల తో పాటు స్లీప్ రోడ్డు మీద ఫుట్ పాత్ కబ్జా చేస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. కమర్షియల్ ఏరియాలో ఫుట్ పాత్ మీద వస్తువులను డిస్ ప్లే చేయడం నిషిద్ధం. పాదాచార్లకు వాహనదారులకు ఇబ్బంది కలిగించే విధంగా వస్తువులు పెడితే చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ తేల్చిచెప్పింది. ఫుట్ పాతుల ఆక్రమణ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. లకడికాపూల్, పంజాగుట్టలో ఫుట్ పాతుల ఆక్రమణ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది.
ఫుట్ పాత్రను ఆక్రమించి వస్తువులను పెట్టిన వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేయనున్నారు. పలు వ్యాపార సంస్థలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసారు. లకడికాపూల్ లో 4 ఫర్నిచర్ షాప్స్ పై FIR నామోదు చేసారు. పాదచారులు నడిచే ఫుట్ పాత్ ను ఫర్నిచర్ వ్యాపారులు ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు వారిపై పలు సెక్టన్ల కింద కేసు నమోదు చేసారు. 447, 341 కింద 4 ఫర్నిచర్ షాప్స్ పై కేసులు నమోదు చేశారు. రాయల్ ఫర్నిచర్ 1, రాయల్ ఫర్నిచర్ 2, Elegant ఫర్నిచర్, The cane ఫర్నిచర్, ఫర్నిచర్ లోడింగ్, అన్ లోడింగ్ కోసం రోడ్డు పైన వాహనాలు నిలిపివేస్తూ వ్యాపారస్తులు ట్రాఫిక్ అంతయారం కల్పిస్తున్నారు. ఫుట్ పాత్ పై వ్యాపారం చేస్తున్న వారు ఇకపై అలర్ట్ గా వుండండి. తస్మాత్ జాగ్రత్త లేదంటే కేసులో బుక్ అవుతాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Gali Janardhan Reddy : గాలి జనార్థన్ రెడ్డి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ