Gali Janardhan Reddy Case Trail At Supreme Court
నేడు గాలి జనార్థన్ రెడ్డి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈనెల 14న జరిగిన విచారణ సందర్భంగా హైదరాబాద్ సీబీఐ కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో 12 ఏళ్లు గడిచినా ట్రయల్ ఇంకా ప్రారంభించకపోవడంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణలో జాప్యం న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జిని సీల్డ్ కవర్ నివేదిక కోరింది. కేసు విచారణ ఏ దశలో ఉందో చెప్పాలని, ట్రయల్ జాప్యానికి కారణాలను వివరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే నేడు.. సుప్రీంకోర్టుకు చేరిన సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి సీల్డ్ కవర్ నివేదిక సమర్పించారు. నేడు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే.. అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పై విధంగా స్పందించింది.