రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులు ఓవైపు చస్తున్నా.. కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు చీడ పడితే ఏం చేయాలో తెలుసన్న ఆయన.. రైతులకు పట్టిన అతిపెద్ద చీడపీడ కేసీఆరే అని విమర్శించారు. ఒకప్పుడు వ్యవసాయం పండుగ అన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు దండగ అంటున్నారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని…
గత కొన్ని రోజులుగా వరి కొనుగోలు ధాన్యం విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెల్సిం దే. అయితే దీనిపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రాం స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు దూషణలతో ఎలాంటి ఉపయోగం ఉండదని రైతుల సమస్యలన పరిష్కరించే విధంగా ఇరు ప్రభుత్వాలు మాట్లాడు కోవాలన్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. మౌలిక సౌకర్యాలు లేకపోవడం…
ధర్నా చేసే హక్కు అందరికీ ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌పై పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తే పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కానీ మేము అడిగితే మాత్రం ఏవేవో కారణాలు చెప్పి ధర్నాలకు అనుమతి నిరాకరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ధర్నా చేద్దాం అన్నా, అనుమతి ఇవ్వని…
ఏపీలో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మద్దతు ఇచ్చారు. రైతులు ఇప్పటికే జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. పాలన అంత అమరావతి నుంచే జరగాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే అమరావతి రైతులు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వారు పాదయాత్రను చేపట్టారు. విజయవాడకు వచ్చిన కోదండరాంను అమరావతి రైతులు కలిసి పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. దీనిపై స్పందించిన కోదండరాం మాట్లాడుతూ… రైతుల ప్రమేయం లేకుండా అమరావతిపై నిర్ణయం…