CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని తెలిపారు. 15 నెలలు పూర్తి చేసుకున్నాం.. మొదటి ఏడాదిలో 57 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాం.. 20 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం.. 150 కోట్ల ట్రిప్పులు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు.. 50 లక్షల మందికి ఇంట్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. 43 లక్షల కుటుంబాలకు 500 రూపాలయకే సిలిండర్లు అందుతున్నాయి.. స్వయం సహాయక సంఘాలలో 65 లక్షల మంది ఉన్నారు.. వాళ్లకు రెండేసి చీరలు.. మన ఇంటికి ఆడబిడ్డలు వస్తే ఎలాంటి చీర పెడతమో అలాంటి చీరలు ఇస్తాం.. స్కూల్స్ కి కంప్యూటర్ టీవీలు ఇచ్చారు కానీ.. కరెంట్ ఇవ్వడం మర్చిపోయారు అని ఎద్దేవా చేశారు. ఆ కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం.. పిల్లల అటెండెన్స్ టీచర్లు తీసుకుంటే.. టీచర్ల అటెండెన్స్ మహిళా సంఘాలకు ఇచ్చిన.. బలహీన వర్గాల లెక్కనే చెప్పనప్పుడు.. మాకు నిధులు, ఉద్యోగం ఎట్లా ఇస్తారని బాధ పడ్డారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Nitish Kumar Reddy: ‘కాటేరమ్మ కొడుకు’గా మారిన నితీశ్ కుమార్ రెడ్డి.. బ్యాట్లనే కత్తులుగా!
ఇక, ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లు సభలో పెట్టామని సీఎం రేవంత్ తెలిపారు. రేపు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందుతుంది.. స్పష్టమైన విధాన పాలసీలతో ముందుకు వెళ్తుంది ఈ ప్రభుత్వం.. బీసీల కోసం ఇది తొలి అడిగే ఇంకా చాలా చేయాల్సి ఉంది చేస్తామన్నారు. రాష్ట్ర అప్పులు పెరిగాయి, అయినా కూడా ధైర్యంగా పథకాలు అమలు చేస్తున్నాం.. ప్రజలకు వాస్తవాలు చెప్తున్నాం.. దుబారా ఖర్చు తగ్గించాం.. 14 నెలలు ఇసుక అమ్మకం పట్టించుకోలేదు.. కోటీ ఆదాయం వచ్చింది రోజు.. నెల రోజుల నుంచి అధికారులను ఒత్తిడి చేస్తే మూడు కోట్లకు పెరిగింది అన్నారు.. జీఎస్టీ కట్టడంలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.. గుజరాత్ ఆరో ప్లేస్ లో ఉంది.. భారత దేశంలో నిత్యావసర ధరలు తక్కువ ఉన్నది తెలంగాణలోనే.. ఇవీ మేము చెప్తున్న లెక్కలు కావు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలేన్నారు. పరిపాలన మీద పట్టు రానట్టు ఉంది అంటున్నారు.. పట్టు అంటే అధికారులను జైల్లో పెట్టడం కాదు అని తేల్చి చెప్పారు. ఇద్దరు మంత్రులను తొలగించడం కాదు.. ఎమ్మెల్యేలు వచ్చి మన వెంట తిరిగిన వాళ్లకు ఏం పని చేయడం లేదని అంటున్నారు.. అందుకే రాజీవ్ యువ వికాసం తెచ్చాం.. అర్హులకే పథకాలు ఇవ్వండి.. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి.. ఆరోపణలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చాము.. ఆరోపణలు లేకుండా ఉపాధ్యాయుల బదిలీ చేశామన్నారు.
Read Also: SBI Yono App: SBI వినియోగదారులకు అలర్ట్.. ఈ యాప్ పని చేయదు..!
అయితే, కలక్టర్ నీ బదిలీ చేయడం ఈజీ.. ఉపాధ్యాయుని బదిలీ చేయడం కష్టం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి బదిలీలు నిజాయితీగా చేశాం.. మన వెంట ఉన్న వాళ్లకు పథకాలు ఇవ్వడం కాదు.. పొలిటికల్ పోస్టులు ఇవ్వండి అని సూచించారు. అర్హత లేకున్నా.. పథకాలు ఇవ్వకండి.. ఇళ్లు, పథకాల విషయంలో మైనార్టీలకు సముచిత న్యాయం కల్పించాలి.. మండలాల వారీగా సమావేశాలు పెట్టండి.. అందరికీ పని కల్పించండి అని ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక, రాష్ట్రంలో గంజాయి ఎక్కువైంది.. పంజాబ్ నీ త్వరలో చేరుకునే అవకాశం ఉంది.. దీని నుంచి బయట పడాలి.. యువతను కాపాడుకోవాలి.. ఇది పార్టీ పథకం కాదు.. ప్రజల పథకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.