హైదరాబాద్ అంబర్‌పేట్ ఫ్లై ఓవర్‌ను సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ పనులను కిషన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొంటారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Karnataka: కేంద్రం అనుమతిస్తే పాక్‌పై ఆత్మాహుతి దాడి చేస్తా.. మంత్రి అహ్మద్‌ఖాన్ వ్యాఖ్య
కొంత మంది ఫ్లై ఓవర్‌ను ఆపే పని చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇంటి స్థలం సేకరించిన తర్వాత ఒక రాజకీయ పార్టీ అడ్డుపడే ప్రయత్నం చేసిందన్నారు. ఇంకా 6 చోట్ల భూ సేకరణ పూర్తి కాలేదని.. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్‌ఎంసీకి లేఖ రాసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలోనే అంబర్‌పేట్ ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన జరిగినట్లుగా గుర్తుచేశారు. గ్రేవీ యార్డ్ కారణంగా రోడ్డు విస్తరణ చేయలేక.. ఫ్లై ఓవర్ నిర్మాణం మంజూరు చేయించినట్లు తెలిపారు. ఫ్లై ఓవర్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: PM Modi- Chandrababu: అమరావతి పునః ప్రారంభంపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ట్వీట్..