Ganesh Immersion: రెండోరోజు కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం..
- నేడు రెండోరోజు గణనాథుల నిమజ్జనం కొనసాగుతుంది..
- ఎన్టీఆర్ మార్గ్- పీవీ మార్గ్‌లో గణేష్ విగ్రహాలు భారీగా చేరుకుంటున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Immersion: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణనాథుల నిమజ్జనం రెండోరోజు కొనసాగుతుంది. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లో గణేష్ విగ్రహాలు భారీగా చేరుకుంటున్నాయి. హుస్సేన్‌సాగర్ దగ్గరకు వినాయక విగ్రహాలు వేలాదిగా తరలివస్తున్నాయి. గణేష్ నిమజ్జనాలు పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా.. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం తరువాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లోపై నిమజ్జనం కోసం గణపతులు క్యూలో ఉన్నాయి. నిమజ్జనం పూర్తి కావడానికి సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. రాత్రి ఒంటిగంటకు చార్మినార్‌లో వినాయక నిమజ్జన శోభయాత్ర ముగిసింది. పాతబస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546, ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద 4,730, నెక్లెస్ రోడ్ 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5230, హైదరాబాద్ అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు వెల్లడించారు. గ్రేటర్ సిటీ మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. బుధవారం సాయంత్రంకల్లా నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గణేష్ మండపాల నుంచి తమ వినాయకులను తొందరగా నిమజ్జనం కోసం తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు..
Astrology: సెప్టెంబర్ 18, బుధవారం దినఫలాలు
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!