రాజేంద్రనగర్ చింతల్ మేట్ లో దారుణం చోటు చేసుకుంది. చింతల్ మేట్‌కు చెందిన యాదమ్మకు నందిని మూడవ కుమార్తె. అయితే నందినికి గత సంవత్సరం చోటు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం గురించి తెలిసిన యాదమ్మ కూతురు నందినిని చోటుతో తిరుగవద్దని పలుమార్లు మందలించింది. ఈ కమ్రంలో సోమవారం మధ్యాహ్నం తల్లికి తెలియకుండా చోటును నందిని ఇంటికి పిలిపించింది.
ఇంటికి వచ్చిన తల్లి యాదమ్మ ఇంట్లో చోటు, నందినిలను చూసి కోపానికి గురైంది. దీంతో నందిని తన చున్నీతో తల్లి యాదమ్మ మెడకు బిగించి ప్రియుడి సహాయంతో హత్య చేసింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం యాదమ్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.