Telangana Police: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ స్కామ్‌లపై అప్రమత్తంగా ఉండాలంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. డీప్ ఫేక్ పై ప్రజలకు ట్విట్టర్‌లో అవగాహన కల్పించారు. నకిలీ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు మరియు వీడియోలను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. వ్యక్తిగత ఫోటోలు అపరిచితుల చేతిలో వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో ప్రొఫైల్ లాక్‌లను ఉపయోగించాలని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ఫోటోలు మరియు వీడియోలను ఫేస్ బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అవసరానికి మించి షేర్ చేస్తారని, ఇలా చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్టే అని తెలిపారు. మనం పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలను ఉపయోగించి డీప్ ఫేక్స్ సృష్టించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించేటప్పుడు ప్రైవసీ సెట్టింగ్‌లను మర్చిపోవద్దని సూచిస్తున్నారు. మనం పోస్ట్ చేసే ఫోటోలు, ఆడియోలో వాయిస్ మాడ్యులేషన్ లో తేడాలు, ఆడియో క్వాలిటీలో తేడాలను గుర్తించవచ్చని వారు తెలిపారు. సోషల్ మీడియా ఎక్కువగా వాడేవారిని సైబర్ నేరాగాళ్లు టార్గెట్ చేస్తారని, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Read also: AP Rain Alert: దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం.. మరి కొద్ది గంటల్లో తీవ్రంగా మారే అవకాశం..
Make sure, with your DP privacy settings, as fraudsters might take your picture & create a fake WhatsApp profile of yours and misuse it.#WhatsappSafety #Safetyawareness #cybercrimes #cybersafety #TelanganaPolice pic.twitter.com/5aS0EhzATg
— Telangana Police (@TelanganaCOPs) November 25, 2024
Health Tips: ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..