Group 1 Exams: నేడు గ్రూప్ -1 పరీక్షకు సర్వం సిద్ధం.. కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..
- ఇవాళ గ్రూప్ -1 పరీక్షకు కేంద్రాల వద్ద సర్వం సిద్ధం చేశారు అధికారులు..
- అభ్యర్థుల ఆందోళనల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ..
- మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group 1 Exams: ఇవాళ గ్రూప్ -1 పరీక్షకు కేంద్రాల వద్ద సర్వం సిద్ధం చేశారు అధికారులు. అభ్యర్థుల ఆందోళనల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు. ఏవిధమైన పొరపాట్లు లేకుండా కడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. దీనికోసం 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఏర్పాట్లు, పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమైంది. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు మళ్ళీ జరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.
Read also: Supreme Court: నేడు సుప్రీం కోర్టులో తెలంగాణ గ్రూప్ 1 కేసు విచారణ..
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
- Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీటీవీ లను ఏర్పాటు చేశారు. TGPSC కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బంది నియామకం ఉంటుంది. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఒకటిన్నర తరువాత గేట్స్ క్లోజ్ చేస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా కేటాయింపు ఉంటుంది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సదుపాయం ఉంటుంది. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు, అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు(సోమవారం) విచారించనుంది.
తాజావార్తలు
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!