Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
- బోనాల వేడుకల్లో భవిష్యవాణి వినిపించిన మాతంగి అనురాధ
- భక్తుల పూజలకు అమ్మవారు సంతోషించారని వెల్లడి
- ఐదు వారాల పాటు శాఖ పూజలు చేయాలని సూచన
- ప్రజా సంక్షేమ ప్రభుత్వాలకు అమ్మవారి ఆశీస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగం వేడుకలో మాతంగి అనురాధ అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. భక్తులు చేసిన పూజలు, నైవేద్యాలకు అమ్మవారు సంతోషించారని, పసుపు కుంకుమలతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కోరికలు నెరవేర్చి సుభిక్షంగా చూసుకుంటానని తెలిపారు. నేను ఎంత శాంతంగా ఉంటే నన్ను అంత ఉగ్రరూపంగా చూపిస్తున్నారన్నారు. అయితే సమాజంలో పాపాలు, అనుకోని విపత్తులు , పసిపిల్లలపై జరుగుతున్న ఘోరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, కలికాలం మూలంగానే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ భక్తితో ఉన్నవారికి ముక్తి, శక్తి, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, గ్రామగ్రామాన తాను ఉండి అందరినీ ఆదుకుంటానని అభయమిచ్చారు.
శాఖ పూజలకు ఆదేశం.. ప్రభుత్వాలకు, భక్తులకు అమ్మవారి ఆశీస్సులు
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండటానికి ఐదు వారాల పాటు శాఖ పూజలు నిర్వహించాలని మాతంగి అనురాధ స్పష్టం చేశారు. చెడు మార్గంలో నడిచేవారిని, నేరాలకు పాల్పడేవారిని తప్పక శిక్షిస్తానని హెచ్చరిస్తూనే, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలకు తమ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని వెల్లడించారు. భక్తులు భయపడాల్సిన పనిలేదని, ధర్మంతో ఉండి అమ్మవారిని పూజించే ప్రతీ ఒక్కరికీ రక్షణగా నిలుస్తానని రంగం వేదికగా భవిష్యవాణిలో వినిపించారు.
Also Read
- Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
- CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
- OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
తాజావార్తలు
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
-
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
-
Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్‌లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!