Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crude Oil Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ముందు ఉంచిన ఒక అనూహ్యమైన కొత్త డిమాండే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇన్నాళ్లూ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతిలో ఉన్నాయనే వార్తలు వినిపించినప్పటికీ, ట్రంప్ ఎంట్రీతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దాంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 5 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 87 డాలర్ల మార్కును దాటేసింది. మరోవైపు అమెరికా డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ కూడా 4.50 శాతానికి పైగా పెరిగి 82 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇవే కాకుండా సహజ వాయువు (Natural Gas) ధరలు కూడా 4.60 శాతం లాభపడి 2.784 డాలర్లకు చేరడంతో గ్లోబల్ మార్కెట్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ హఠాత్ పరిణామానికి ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయమే కారణం. ఇరాన్ ప్రమేయం ఉన్న వివిధ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన, తీవ్రంగా గాయపడిన అమెరికన్ల కోసం ఇరాన్ భారీగా నష్టపరిహారం చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇకపై అమెరికా-ఇరాన్ మధ్య జరిగే ఏ చర్చల్లోనైనా ఈ పరిహారం అంశం ఖచ్చితంగా ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. గత ఐదు నెలలుగా సాగిన సైనిక ఘర్షణల్లో తమకు జరిగిన నష్టానికి పరిహారం కావాలని అంతకుముందు ఇరాన్ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన ట్రంప్, అది చాలా ఆసక్తికరమైన ఆలోచన అని వ్యాఖ్యానిస్తూనే, అదే తరహా డిమాండ్‌ను ఇరాన్ ముందు ఉంచి షాక్ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్ తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని భావించినప్పటికీ, ఈ కొత్త ట్విస్ట్‌తో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. యుద్ధం ఆగినప్పటికీ, ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపు 20 శాతానికి రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి (Hormuz Strait) విషయంలో ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శాంతి చర్చల్లో ఈ కొత్త మలుపు రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం (Inflation) మరింత పెరిగే ప్రమాదాన్ని ముంగిట్లోకి తెచ్చిపెట్టింది.
Also Read
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!