నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక మరోసారి వాయిదా పడింది. స్పేస్‌ఎక్స్ రాకెట్ ప్రయోగం వాయిదా పడటంతో భూమ్మీదకు తిరిగి రావడం ఆలస్యం కాబోతుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ రాకెట్‌లో నలుగురు వ్యోమగాముల సిబ్బంది ఉన్నారు. ఈ వ్యోమగాములు.. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భర్తీ చేయనున్నారు. కానీ హైడ్రాలిక్ సిస్టమ్ సమస్య కారణంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లే రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. దీంతో మరిన్ని రోజులు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Sudiksha Missing: సుదీక్ష అదృశ్యంపై పోలీసుల తాజా వెర్షన్ ఇదే..!
నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధమైంది. బయల్దేరే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య తలెత్తడంతో ఆపేసినట్లు నాసా పేర్కొంది. సమస్యను పరిష్కరించి వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రాక ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: University of Hyderabad: వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ వర్సిటీ.. 7 అంశాలలో..!
2024 జూన్ 5న సునీత విలియమ్స్, విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఇటీవల సునీత విలియమ్స్ స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడుతూ.. తమ కోసం మార్చి 12న స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్షనౌక రానుందని, నౌకలో కొత్తగా ఐఎస్‌ఎస్‌లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని చెప్పారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు రాబోతున్నట్లు తెలిపింది. కానీ చివరి నిమిషంలో క్రూ-10 అంతరిక్షనౌక ప్రయాణం వాయిదా పడింది. దీంతో వారికి నిరాశ ఎదురైంది.
ఇది కూడా చదవండి: Vijay Antony : మరో కొత్త కాన్సెప్ట్‌తో విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ టీజర్..