Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపై కనిపించే చాలా మంది హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో హోమ్లీగా కనిపించి, ఆ తర్వాత స్టైలిష్ అండ్ బోల్డ్ లుక్స్‌తో షాక్ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఇదే దారిలో ప్రయాణిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ తేజస్వి రావు. ఒకప్పుడు ఆమెను సినిమాల్లో చూసి పద్ధతిగా అనుకున్న ప్రేక్షకులు, ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఫోటోషూట్స్ చూసి నోరెళ్లబెడుతున్నారు. సినిమా అవకాశాల కోసమే తేజస్వి ఈ రూటు మార్చారా అనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో హాట్ టాపిక్. కెరీర్ ప్రారంభంలో ‘కమిటీ కుర్రాళ్ళు’, అలాగే ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సినిమాలతో తేజస్వి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాల్లో ఆమె పాత్రలు చాలా సాదాసీదాగా, సాంప్రదాయంగా ఉండేవి. ఆయా పాత్రలకు ఆమె న్యాయం చేసినప్పటికీ, ఆ సినిమాలు ఆమెకు ఆశించినంత గుర్తింపును లేదా పెద్ద బ్రేక్‌ను తెచ్చిపెట్టలేకపోయాయి. టాలెంట్‌తో పాటు గ్లామర్ కూడా ఉంటేనే ఈ పరిశ్రమలో ఎక్కువ కాలం నిలబడగలమనే సత్యాన్ని ఆమె ఆలస్యంగానైనా గ్రహించినట్లు కనిపిస్తోంది. పద్ధతిగా ఉండే పాత్రలతో పెద్దగా అవకాశాలు రాకపోవడం వల్లే ఆమె తన స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తేజస్వి షేర్ చేసిన చిత్రాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి.
ముఖ్యంగా ఆమె పోస్ట్ చేసిన బీచ్ ఫోటోషూట్ పిక్స్ ఇంటర్నెట్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఈ చిత్రాలలో తేజస్వి తన అందాలను స్వేచ్ఛగా ఆరబోస్తూ, గతంలో ఎన్నడూ లేని విధంగా బోల్డ్ అండ్ గ్లామరస్ అవతారంలో మెరిసింది. పద్ధతిగల ఇమేజ్ నుండి ఒక్కసారిగా బోల్డ్ లుక్‌లోకి మారడం ఆమె అభిమానులకు షాకింగ్ అయినప్పటికీ, ఆమె కొత్త రూపాన్ని ప్రశంసించేవారు కూడా తక్కువ కాదు. అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తేజస్వి, తన కొత్త గ్లామరస్ అవతారంతో టాలీవుడ్ దర్శకుల దృష్టిని ఆకర్షించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. హోమ్లీ ఇమేజ్ తన కెరీర్‌కు కొంత అడ్డంకిగా మారిందని భావించిన ఆమె, బోల్డ్ రూట్లోకి వెళ్లడం ద్వారా కొత్త అవకాశాలను అందుకోవచ్చని ఆశిస్తోంది. ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫోటోషూట్స్ ద్వారా ఆమె గ్లామర్ పాత్రలకు కూడా తాను సిద్ధమేనని పరిశ్రమ వర్గాలకు సంకేతాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ అందాల విందు ఆమెకు టాలీవుడ్లో సరికొత్త ఆఫర్లను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి!
Also Read
- Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న 'మహానటి'!
- Dhurandhar 2 vs Ramayan: 'ధురంధర్ 2' వర్సెస్ 'రామాయణ'.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
- Chiranjeevi: 'మెగాస్టార్' ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
- Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
-
Vivo T6x 5G: Vivo T6x 5G త్వరలో భారత్‌లో లాంచ్.. BIS సర్టిఫికేషన్‌లో ప్రత్యక్షం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీ
-
PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!