Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudapati Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. కూటమి సర్కార్‌లో కీలకమైన తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు గూడపాటి శ్రీనివాసరావు .. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు వైఎస్ జగన్.. ఇక, ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గూడపాటి శ్రీనివాసరావును వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని అన్నారు. ఆయనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసి మంచి చేస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసి పార్టీ అభ్యర్థి మోహన్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్.. గూడపాటి శ్రీనివాసరావు చేరికతో రేపల్లె పట్టణంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్.. కాగా, ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం ఉన్నా.. అడపదడపా.. ఇతర పార్టీల నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తూ వస్తున్నారు వైఎస్ జగన్.. ఇక, తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పీటా నాగమోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Also Read
- CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు ఫైనల్ వార్నింగ్.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే వేటే..!
- AP SEC Meeting: సుప్రీంకోర్టు ఆదేశాలతో అలర్ట్.. ఎస్ఈసీ అత్యసర సమావేశం..!
- Supreme Court: వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల అడ్డంకులపై సుప్రీం సీరియస్.. కీలక ఆదేశాలు
- CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!