Minister Uttam: బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ఆర్ధిక నష్టం ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
Minister Uttam: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టు తెలిసింది.
కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన బియ్యం.. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.. అయితే, ఒప్పందంలో భాగంగా తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం పంపిస్తున్నారు.. లోడింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్న షిప్‌ను జెండా ఊపి ప్రారంభించారు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి..
Minister Uttam: నేడు కాకినాడ జిల్లాలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం ఎగుమతి చేయనున్నారు.
CM Revanth Reddy: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు (మార్చ్ 24) సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణపై నిబద్ధతతో ఉన్నామని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేసిన ఘనత తమ సీఎం, ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. బీసీ కుల గణన లెక్కలు తప్పు అంటున్నారు.. ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు.
ఎస్ఎల్బీసీ (SLBC)టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 15వ రోజుకు చేరింది. జీపీఆర్ (GPR), క్యాడవర్ డాగ్స్లతో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్, TBM మిషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి.
SLBC Incident : శ్రీశైలం వద్ద నిర్మిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌లో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ టన్నెల్ నిర్మాణ పనుల సమయంలో మధ్యలో ఓ భాగం కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న ఎనిమిది మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. శనివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా చర్యలు తీసుకుంటూ, రెస్క్యూ ఆపరేషన్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాయి.…
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో ప్రతిష్టాత్మక నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 98 మందికి 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఏ పాలకులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే మేము 20% పెంచి రైతు భరోసా ఇస్తున్నాం.
అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రక్రియ మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరూ మిగిలిపోరని తెలిపారు. "వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరానికి రైతు భరోసా ఇస్తాం. ఉపాధి హామీలో నమోదై, కనీసం ఇరవై రోజులు పని చేసిన వారికి ఆత్మీయ భరోసా ఇస్తాం. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం నాలుగు పథకాలపై…