AA22×A6 : అల్లు అర్జున్ – అట్లీ కాంబో హాలీవుడ్ టచ్‌తో భారీ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ పై ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రానికి తాత్కాలికంగా “AA22×A6” అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేయగా. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసం హాలీవుడ్‌లోని ఒక ప్రముఖ స్టూడియో, ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్‌తో కలిసి కో-ప్రొడ్యూస్ చేయడానికి చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఏ స్టూడియో అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read :OG: పవన్ – ప్రియాంక మెలోడీ సాంగ్ రిలీజ్ డేట్ లాక్! ఫ్యాన్స్ ఊహించని సర్‌ప్రైజ్
Also Read
ఇక ఈ చిత్రాన్ని కేవలం పాన్-ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా, పాన్-వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో టీమ్ ఉంది. ఇందుకోసం యుఎస్‌ఏలోని ఓ క్రియేటివ్ ఏజెన్సీతో కలిసి ఒక ఇంటర్నేషనల్ ప్రమోషన్ స్ట్రాటజీ రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, ఈ ప్రాజెక్ట్‌కు విస్తృత స్థాయి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అల్లు అర్జున్ గత చిత్రం “పుష్ప”తో అల్‌రెడి నేషనల్ స్థాయిలోనే కాదు, గ్లోబల్ మార్కెట్‌లో కూడా విపరీతమైన పాపులారిటీ సాధించారు. ఈ సక్సెస్ తర్వాత అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. హాలీవుడ్ స్టూడియో భాగస్వామ్యం, పాన్-వరల్డ్ ప్రమోషన్ ప్లాన్ వాస్తవమైతే, ఇది ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!