CM Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే మీరాలం బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి.. ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అవుతుంది. దాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక, రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ.. దానికి వసతులు కల్పించడం.. ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంది అన్నారు. ఇక, మూడు కోట్ల తెలంగాణ జనాభాలో కోటి 34 లక్షల మంది హైదరాబాద్ లో నివసిస్తున్నారు.. వచ్చే 20 ఏళ్లలో 75 శాతం జనాభా హైదరాబాద్ కి వస్తారని అసెంబ్లీలో సీఎం పేర్కొన్నారు. అయితే, కడుపు నిండా మూసీలో కంటే ఎక్కువ విషం ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Read Also: 50MP ట్రిపుల్ కెమెరా, 90W ఫాస్ట్ చార్జింగ్, స్లిమ్ డిజైన్ తో Moto X70 Air Pro లాంచ్‌కు రెడీ..!
అయితే, ఈ మనుషుల విషం.. మూసీలో మురికి కంటే ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మేము వివరాలు చెప్తుంటే.. ఎందుకు విషం కక్కుతున్నారని ప్రశ్నించారు. వాస్తవాలు ప్రజలకు తెలియొద్దని వాళ్ళ బాధపడుతున్నారు.. ఆ కండ్లు చూడండి.. విషపుంతో నిండిపోయాయి.. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేను తీసుకుని మూసీ కార్పొరేషన్ చైర్మన్ చేసిన వాళ్లా చెప్పేది.. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను చూసి నేర్చుకోండి అని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలను అభివృద్ధి చేయండి అని వెల్లడించారు. ఉప్పల్ ఎమ్మెల్యే కూడా వచ్చి చెప్పాడు.. మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? అని ప్రశ్నించారు. ప్రక్షాళన చేయాలి అంటే సలహాలు ఇవ్వండి.. నష్టపోతున్న వారికి కాలనీ కట్టిస్తాం.. నష్టపోయిన వారికి వ్యాపారం చేసుకునే వేసులుబాటు కల్పిస్తామని రేవంత్ చెప్పారు.
Read Also: CM Revanth Reddy: ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన.. ఫామ్ హౌస్ల డ్రైనేజీ నీళ్లను గండిపేటలో కలిపారు..
ఇక, మూసీ ప్రక్షాళన వద్దు అనే వాళ్లు.. అంబర్ పేట శ్మశాన వాటిక దగ్గరికి పోయి చూడమని చెప్పండి.. ప్రపంచ స్థాయి కంపనీలకు ఇస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాంట్రాక్టులు ఇవ్వడం, కమిషన్ లు తీసుకోవడం మాకు రాదని తెలిపారు. మేము 80 వేల పుస్తకాలు చదవలేదు.. ఇప్పుడే మూసీ ప్రక్షాళనకి ఎంత అవుతుందని మేము ఇప్పుడే చెప్పలేం.. మూసీ పరివాహక ప్రాంతంలో శివాలయం, గురుద్వార్, ఉప్పల్ సమీపంలో చర్చి కడతాం అన్నారు. DPR ఫైనల్ అయ్యాకా.. సభలో పెడతా, అందరి సలహాలు తీసుకుంటా.. బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ కడతామని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదిరింది. మీలాగా కేసులు నుంచి తప్పించుకోవడం కోసం కాదు అన్నారు. మూసి పరివాహక ప్రాంత MLA లు విదేశీ పర్యటన చేసి సలహాలు ఇవ్వండి.. ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది మేము మంచి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. మీరు సలహాలు ఇవ్వండి.. డీపీఆర్ రాగానే ఎమ్మెల్యేలు.. ఫ్లోర్ లీడర్స్ నీ పిలిచి చర్చిస్తా.. సలహాలు ఇస్తే తీసుకుంటా కడుపులో విషం తగ్గించుకోండి అని రేవంత్ రెడ్డి సూచించారు.
