డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏఐఎమ్‌ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్వాగతిస్తున్నాము. కేంద్రం పారదర్శకంగా లేదు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. RRR మంజూరు...మెట్రో మంజూరు కోసం ..బాపు ఘాట్ అభివృద్ధికి ... మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని అడిగారు.
Anil Kumar Yadav : రాజ్యసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మూసీ నది ప్రస్తావించారు. దేశంలోని ముఖ్యమైన నదుల్లో మూసీ నది ఒకటని, గతంలో దీన్ని ముచ్‌కుందా అనే పేరుతో పిలిచేవారని గుర్తు చేశారు. ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఉద్భవించి, హైదరాబాద్ నగరాన్ని దాటి నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల గుండా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుందని వివరించారు. మూసీ నది గాఢమైన చరిత్రను కలిగి ఉందని, హైదరాబాద్…
సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి.. భీమలింగంకు పూజలు చేశారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.