Telangana Reservoirs: తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రధాన జలాశయాలకు ఎగువ ప్రాంతాల వర్షాల కారణంగా భారీగా నీరు చేరుతున్నాయి. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నదిలోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. దీనితో అధికారులు 40 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో…
పేద ప్రజల పొట్ట కొట్టి పెద్దలకు పంచడమే మూసీ ప్రాజెక్ట్ లక్ష్యంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శాసనమండలి మీడియా పాయింట్ దగ్గర కవిత మీడియాతో మాట్లాడారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటో షూట్ కోసం మూసీ నిద్ర చేశారని అన్నారు. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల మందు, ఈగల మందు కొట్టారు.. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయని పేర్కొన్నారు.
Kishan Reddy : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులయ్యే నిర్వాసితులకు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ మూసీ నిద్రలో భాగంగా కిషన్ రెడ్డి అంబర్‌పేట గోల్నాకలోని తులసీరామ్ నగర్‌కు చేరుకొని బస్తీవాసులు, బాధితులను కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బుల్డోజర్లకి భయపడే వారు ఎవరు లేరని, పేద ప్రజల జోలికి…
CM Revanth Reddy: హైదరాబాద్ నడిబొడ్డున మూసీ పునరుజ్జీవనంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు..
ఉభయ తెలుగు రాష్ట్రాలపై గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. గులాబ్ విజృంభణతో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, నదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. దీంతో.. తెలంగాణలోని 14 జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.. ఇక, హైదరాబాద్‌లోనూ ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. సాయంత్రం నుంచి అయితే.. కుంభవృష్టే కురుస్తోంది.. ఈ ఎఫెక్ట్ క్రమంగా మూవీ నది ప్రభావంపై పడుతుండడంతో.. అప్రమత్తమైన అధికారులు.. మూసీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.. ఇవాళ మూసీ 6…