తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బీసీలకు రీజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం.. ఇతర రాష్ట్రాల్లో వచ్చిన అడ్డంకులు తెలంగాణలో రావొద్దన్నదే మా ఆలోచన.. ఆరునూరైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులు చేసి పంపితే గవర్నర్, రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టారు.. గత సర్కార్ 50 శాతం రిజర్వేషన్లు…
అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, సభ నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
Madhusudhana Chary: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి మాట్లాడుతూ.. గతంలో మీరు (కాంగ్రెస్) ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయలేదు అని విమర్శించారు.
MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
CM Revanth Reddy: బీసీ నేతలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బలహీన వర్గాల లెక్క తేలాలని కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు.. బీసీలు తెలిపే అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీకి అందివ్వాలన్నారు.