Cyber Crime: హైదరాబాద్‌లో వెలుగు చూసిన కాల్ సెంటర్ స్కాం..
- హైదరాబాద్ లో నకిలీ కాల్ సెంటర్ల స్కాం..
- 50 మందిని అదుపులోకి తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
- హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలు సరి చేస్తామంటూ మోసాలు..
- డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి ఖాతాల్లో నగదు కాజేస్తున్న నిందితులు..
- హైటెక్ సిటీలో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: హైదరాబాద్ నగరంలో కాల్ సెంటర్ల స్కాం వెలుగులోకి వచ్చింది. పే పాల్ వినియోగిస్తున్న కస్టమర్స్ డేటా చోరీ చేసినట్లు గుర్తించారు. విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్ టార్గెట్ గా ఈ స్కాం చేశారు. దీంతో పాటు హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలను సరిచేస్తామంటూ మోసాలు చేసి.. బ్యాంకు అకౌంట్, డెబిట్, క్రెడిక్ కార్డులు వివరాలు సేకరంచి ఖాతాల్లో నగదు కాజేస్తున్నారు నిందితులు. ఇక, ఈ కాల్ సెంటర్ పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోదాలు చేసి సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుంది. అలాగే, భారీగా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది.
Read Also: Malala: 13 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టిన నోబెల్ గ్రహీత మలాలా
Also Read
కాగా, హైటెక్ సిటీలోని పత్రికా నగర్ అడ్డాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. 63 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నాం.. ఎక్కువ మంది నార్త్ ఈస్టర్న్ దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు.. అమెరికాకి చెందిన పే పాల్ అనే యాప్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.. అధునాతన సాప్ట్ వేర్ EYEBEAM, X-LITE ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఉన్న వాళ్ళే టార్గెట్ గా చేసుకుని ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నారు.. ఫ్రాడ్ ప్రివెన్షన్ టీమ్ అని చెప్పుకుంటూ కాల్స్ చేస్తున్నారు.. 63 మందిలో 22 మంది అమ్మాయిలు ఉన్నారు.. సోషల్ మీడియాలో ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి రిక్రూట్ చేసుకున్నారు అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పేర్కొనింది.
Read Also: Daggubati Venkateswara Rao: నాకు, చంద్రబాబుకు వైరం ఉంది నిజమే!
ఇక, ఎలా సైబర్ నేరాలకు పాల్పడాలో కూడా శిక్షణ ఇచ్చారు అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. Exito సొల్యూషన్స్ ఎండీ చందా మనస్వనినీ అరెస్ట్ చేశాం.. నెట్వర్క్ ను ఆపరేట్ చేస్తున్న జాదు భాయ్, రాహుల్ అలియాస్ ప్రతిక్ ను కూడా ఉన్నారు.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లింక్డ్ ఇన్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ ద్వారా యువతీ, యువకులను రిక్రూట్ చేసుకున్నారు.. కాల్ సెంటర్ లో ఉద్యోగాల పేరుతో వారిని నియమించుకున్నారు.. ఒక్కొకరికి రూ. 30 వేల జీతం ఇచ్చారు.. 52 మొబైల్ ఫోన్స్, 63 ల్యాప్ టాప్స్, 27 ఐడీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!