India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ కైవసం లక్ష్యంగా భారత్..
- తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం
- రెండో వన్డేలో మహమ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies 2nd ODI: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు.. గువహతి వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకొనేందుకు భరత్ కన్నేసింది.
తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో భారత్ 295 పరుగుల లక్ష్యాన్ని కేవలం 41.4 ఓవర్లలోనే ఛేదించింది. 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఇప్పుడు అదే జోరును రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించాలని భారత జట్టు ప్లాన్ చేస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఎదురైన లోపాలను సరిదిద్దుకుని సిరీస్‌ను సమం చేయాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది.
Also Read
- Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
- Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
- Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
- Redmi Pad 3 లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్లు లీక్.. 10,000mAh బ్యాటరీతో రాక!
రెండో వన్డేకు మహమ్మద్ సిరాజ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో ఆడని సిరాజ్‌కు తుది జట్టులో చోటు కల్పిస్తే ప్రసిధ్ కృష్ణకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా జట్టు కూర్పులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. తొలి వన్డేలో 32 పరుగులు చేసిన రోహిత్.. ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. గిల్ మాత్రం తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో తన ఫామ్‌ను చాటుకున్నాడు.
మూడో స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగనున్నాడు. తొలి వన్డేలో శతకంతో ఆకట్టుకున్న కోహ్లీ నుంచి మరోసారి భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉండగా.. ఆ తర్వాత రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ కీలకంగా వ్యవహరించనున్నాడు.
మరోవైపు రెండో వన్డేకు ముందు వెస్టిండీస్‌కు ఊహించని షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ గాయం కారణంగా గువహతి వన్డేకు దూరమయ్యాడు. తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డే సందర్భంగా గ్రీవ్స్ పిక్క కండరానికి గాయమైంది. మైదానంలో పరుగులు తీయడానికి ఇబ్బంది పడినప్పటికీ ఫిజియోథెరపిస్ట్ సహాయంతో అతను బ్యాటింగ్ కొనసాగించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యే సమయానికి 108 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అయితే గాయం తీవ్రత కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కు కూడా అతను మైదానంలోకి రాలేదు. పూర్తిగా కోలుకోకపోవడంతో గువహతి మ్యాచ్‌కు అతడిని జట్టు నుంచి తప్పించారు.
అక్టోబర్ 3న న్యూ చండీగఢ్‌లో జరగనున్న మూడో వన్డేకు కూడా గ్రీవ్స్ అందుబాటుపై అనుమానాలు ఉన్నాయి. దీనితో వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరమైన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ రెండో మ్యాచ్‌కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతనికి మిడిల్ ఆర్డర్లో చోటు దక్కవచ్చు.
రెండో వన్డేకు భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
-
Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
-
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
-
SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. ‘వారణాసి’పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!