Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- టెంబా బవుమా, క్వింటన్ డికాక్ మధ్య వాగ్వాదం
- ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూ తీసుకోవాలా వద్దా అనే అంశంపై ఇద్దరి మధ్య చర్చ
- సోషల్ మీడియాలో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Temba Bavuma: సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ సందర్భంగా రివ్యూ విషయంలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48వ ఓవర్లోని నాలుగో బంతికి లిజాడ్ విలియమ్స్.. ఆస్ట్రేలియా బ్యాటర్ జేవియర్ బార్ట్లెట్ను ఎల్బీడబ్ల్యూ కోసం బలంగా అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో రివ్యూ తీసుకోవాలా వద్దా అనే విషయంలో బవుమా, డికాక్ మధ్య చర్చ జరిగింది.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
చివరకు బవుమా రివ్యూకు వెళ్లగా.. రీప్లేలో మూడు రెడ్స్ కనిపించడంతో బార్ట్లెట్ ఔట్‌గా తేలాడు. అప్పటివరకు 28 బంతుల్లోనే 50 పరుగులు చేసిన బార్ట్లెట్ పెవిలియన్ చేరాడు. అయితే రివ్యూ సమయంలో బవుమా, డికాక్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఇద్దరూ ఒకరిపై ఒకరు వేలు చూపించుకుంటూ వాదించుకున్నారు.
వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో మార్కో జాన్సెన్ జోక్యం చేసుకుని డికాక్‌ను శాంతింపజేశాడు. దానితో డికాక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక బార్ట్లెట్ను ఔట్ చేసిన బంతిని విలియమ్స్ అద్భుతమైన యార్కర్‌గా వేశాడు. మిడిల్, లెగ్ స్టంప్‌లను లక్ష్యంగా చేసుకుని వేసిన బంతిని బార్ట్లెట్ వెనక్కి జరిగి ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ బంతిని మిస్ చేశాడు. అది నేరుగా అతడి ప్యాడ్లను తాకింది. దీనితో బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలడంతో ఎల్బీడబ్ల్యూ నిర్ధారణ అయింది.
రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 32 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఐదో విజయం. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సెంచరీతో రాణించగా.. డేవిడ్ మిల్లర్ కూడా శతకం సాధించాడు. బ్యాటర్లు ఇచ్చిన భారీ స్కోరును బౌలర్లు కాపాడుకోవడంతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం బవుమా మాట్లాడుతూ.. ఇది సమష్టి జట్టు ప్రదర్శన అని పేర్కొన్నాడు. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు కాస్త కష్టంగా ఉన్నప్పటికీ పరిస్థితులను ఎదుర్కొని మంచి స్కోరు సాధించామని చెప్పాడు. డేవిడ్ మిల్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని, బౌలర్లు కూడా ఒత్తిడిని తట్టుకుని రాణించారని ప్రశంసించాడు. అలాగే తన సెంచరీపై స్పందిస్తూ.. బ్యాటింగ్‌లో జట్టుకు సహకరించడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని బవుమా చెప్పుకొచ్చాడు.
The heated moment between Temba Bavuma and Quinton De Kock. pic.twitter.com/dbbvlEbGOu
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2026
తాజావార్తలు
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?