Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ECI Removes Annexure-D From Form-6: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ చుట్టూ నడుస్తున్న తీవ్ర వివాదాల వేళ భారత ఎన్నికల సంఘం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త ఓటరు నమోదు కోసం పూర్తి చేసే ఫారమ్-6 తో పాటు ఎలాంటి అదనపు డిక్లరేషన్ ఫారమ్ లేదా అన్ఎక్సర్-డి (Annexure-D) సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన ఫారమ్-6 అసలు స్వరూపంలో తాము ఎలాంటి చట్టపరమైన మార్పులు చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
అసలు ఈ వివాదం ఎలా మొదలైంది..?
ఓటర్ల జాబితాను మరింత ప్రక్షాళన చేసేందుకంటూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ సమయంలో ఫారమ్-6 తో పాటు ‘అన్ఎక్సర్-డి’ అనే అదనపు డిక్లరేషన్ ఫారమ్‌ను ఈసీ తప్పనిసరి చేసింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో, ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన రాష్ట్రాల్లో ఆన్లైన్ ఫారమ్-6 నుంచి ఈ అదనపు డిక్లరేషన్ ఫారమ్‌ను తొలగించి, పాత పద్ధతినే పునరుద్ధరించింది. ఇకపై ఎస్ఐఆర్ లేని రాష్ట్రాల్లో ఎలాంటి అదనపు పత్రాలు లేకుండా పాత ఫారమ్-6 ప్రాతిపదికనే ఆన్లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. నిజానికి ఈ పాత ఫారమ్-6 కి, ఎస్ఐఆర్ తో కూడిన ఫారమ్-6 కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన చోట ప్రతి ఓటరుకు సంబంధించిన తల్లిదండ్రులు, తాతముత్తాతలు లేదా కుటుంబ సీనియర్ల వివరాలు ఇప్పటికే డిజిటల్‌గా నమోదై ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ కుటుంబ సభ్యుల పాత ఓటింగ్ రికార్డులను మళ్లీ సమర్పించాల్సిన పనిలేదు. కానీ ఎస్ఐఆర్ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు.. 2000ల ప్రారంభంలో జరిగిన పాత ఎస్ఐఆర్ సమయంలో తమ పేరు కానీ, తమ తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పేర్లు కానీ ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో డిక్లేర్ చేయాల్సి వచ్చేది. అంతేకాకుండా తమ పూర్వపు నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ బూత్ నంబర్, పాత సీరియల్ నంబర్ వంటి వివరాలను కచ్చితంగా పూర్తి చేయాల్సి వచ్చేది.
Also Read
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
సాంకేతికంగా ఈ వివరాల నమోదు ఐచ్ఛికమే (ఆప్షనల్) అని చెప్పినప్పటికీ, ECINET పోర్టల్‌లో ఆ వివరాలు ఎంటర్ చేయకుండా ఫారమ్ ముందుకు సబ్మిట్ అయ్యేది కాదు. దీంతో ముఖ్యంగా 2000ల తర్వాత పుట్టిన 18 ఏళ్ల యువతకు, మొదటిసారి ఓటు హక్కు పొందేవారికి ఈ పాత రికార్డులు వెతికి పట్టుకోవడం పెద్ద నరకంగా మారింది. గతంలో ఏదో ఒక కారణంతో ఓటు కోల్పోయినవారు తిరిగి పేరు నమోదు చేసుకోవాలన్నా అనేక చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు పాత ఫారమ్-6 విధానం రావడం వల్ల ఎలాంటి పాత కుటుంబ వివరాల మ్యాపింగ్ అవసరం లేకుండా, యువత కేవలం తమ సాధారణ వ్యక్తిగత వివరాలు, వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేసి నేరుగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అసలు ఈ అదనపు డిక్లరేషన్ ఎందుకు తెచ్చారు?
ఈ వివాదం ఎందుకు రేగిందంటే.. ఓటర్ల జాబితాలో అక్రమాలను, అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవడానికే ఎస్ఐఆర్ కింద ఈ నిబంధన తెచ్చామని ఈసీ చెప్తోంది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయంపై ఈసీ అంతర్గతంగానే తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఓటరు నమోదు నిబంధనలు-1960 ప్రకారం చట్టబద్ధమైన ఫారమ్-6 లో మార్పులు చేసే అధికారం కేవలం పార్లమెంట్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, ఎన్నికల సంఘం తనంతట తానుగా ఆన్లైన్ పోర్టల్‌లో దీన్ని నిర్బంధం చేయడం కుదరదని ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంతర్గత విభేదాలు, వివాదాల నేపథ్యంలో ఎన్నికల సంఘం దిగివచ్చి, ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో ఈ నిబంధనను ఎత్తివేసి, ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తున్న రాష్ట్రాలకు మాత్రమే దాన్ని పరిమితం చేసింది.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?