2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- ఐకూ 16ను చైనాలో కంపెనీ అధికారికంగా లాంచ్
- 6.85 అంగుళాల 2K+ శామ్సంగ్ M16 LTPO AMOLED డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్, అడ్రినో 850 GPU
- వెనుక 50MP + 50MP + 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా
- భారీ 8,400mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
- గేమింగ్ కోసం ప్రత్యేక Q4 చిప్, 8,500 చదరపు మిల్లీమీటర్ల 3D వేపర్ ఛాంబర్
- ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 7పై ఫోన్ పనిచేస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO 16 Launched: ఐకూ నుండి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐకూ 16 (iQOO 16)ను అధికారికంగా చైనాలో లాంచ్ చేసింది. ఈ మొబైల్ లో గేమింగ్ పనితీరు, డిస్ప్లే, కెమెరా, థర్మల్ మేనేజ్మెంట్తో పాటు భారీ బ్యాటరీపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
50MP ట్రిపుల్ కెమెరా
వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను అందించారు. ఇందులో 1/1.3 అంగుళాల పెద్ద సెన్సార్, f/1.68 అపెర్చర్, OIS ఉన్నాయి. గత తరం హై-ఎండ్ బెంచ్‌మార్క్‌తో పోలిస్తే లైట్ ఇన్‌టేక్ 79% పెరిగిందని కంపెనీ పేర్కొంది. దీనికి జతగా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. పెరిస్కోప్ కెమెరాలో 1/1.95 అంగుళాల సోనీ సెన్సార్, OIS, f/2.65 అపెర్చర్ ఉన్నాయి.
Also Read
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఇచ్చారు. కెమెరాలో NICE 3.0 ఆప్టికల్ రీకన్స్ట్రక్షన్ ఇంజిన్, సూపర్ లైట్ అండ్ షాడో HDR సాఫ్ట్వేర్ ఉన్నాయి. 4K అల్ట్రా HD లైవ్ ఫొటో ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
8,400mAh బ్యాటరీ
ఫోన్లో 8,400mAh బ్లూ ఓషన్ బ్యాటరీ ఉంది. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ సమయంలో బ్యాటరీని బైపాస్ చేసి నేరుగా పవర్ అందించే డైరెక్ట్-డ్రైవ్ పవర్ సప్లై ఫీచర్ కూడా ఉంది. iQOO 16 ఆండ్రాయిడ్ 17 ఆధారిత OriginOS 7పై పనిచేస్తుంది. ఒకే స్క్రీన్‌పై ఐదు యాప్‌లను ఒకేసారి ఉపయోగించుకునేలా “అటామిక్ వర్క్ బెంచ్” ఫీచర్‌ను అందించారు.
డిజైన్, డిస్ప్లే
iQOO 16 మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో లైట్ చేజర్, రేసింగ్ ట్రాక్, లెజెండ్ ఉన్నాయి. వెనుక భాగంలో ఫ్లోటింగ్ డిజైన్‌తో కెమెరా మాడ్యూల్‌ను అందించారు. ఇందులో మూడు కెమెరాలు త్రిభుజాకార అమరికలో ఉంటాయి.
ఫోన్లో 6.85 అంగుళాల 2K+ శామ్సంగ్ M16 LTPO AMOLED డిస్ప్లే ఉంది. ఇది 3168×1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, DCI-P3 కలర్ గ్యామట్, 1.07 బిలియన్ కలర్స్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే గరిష్ఠంగా 2,800 నిట్స్ HBM బ్రైట్నెస్, లోకల్ పీక్ బ్రైట్నెస్ 10,000 నిట్స్ వరకు అందిస్తుంది. కంటి రక్షణ కోసం DC డిమ్మింగ్, 3,300Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
శక్తివంతమైన ప్రాసెసర్
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో 2nm ప్రాసెస్‌పై తయారైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 మొబైల్ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించారు. ఇందులో అడ్రినో 850 GPUతో పాటు ప్రత్యేకమైన Q4 గేమింగ్ చిప్ ఉంది.
కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ AnTuTu బెంచ్‌మార్క్‌లో సుమారు 55.7 లక్షల పాయింట్ల స్కోర్ సాధించింది. గేమింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు 8,500 చదరపు మిల్లీమీటర్ల 3D వేపర్ ఛాంబర్ ను అందించారు. దీనికి 29,453 చదరపు మిల్లీమీటర్ల మొత్తం విస్తీర్ణం కలిగిన మూడు-లేయర్ గ్రాఫైట్ సిస్టమ్ కూడా ఉంది.
గేమింగ్ ఫీచర్లు
Q4 గేమింగ్ చిప్‌లో ఫుల్-సీన్ రే ట్రేసింగ్, QNSS సూపర్-రెండరింగ్ ఇంజిన్ ఉన్నాయి. ఆరు ప్రముఖ గేమ్స్‌లో 2K రిజల్యూషన్‌తో 165fps ఫ్రేమ్ ఇంటర్పొలేషన్ను ఒకేసారి ఉపయోగించవచ్చు. అలాగే 11 గేమ్స్‌లో నేటివ్ QNSS రెండరింగ్, 13 గేమ్స్‌లో 2K సూపర్-రిజల్యూషన్, వందలాది గేమ్స్‌లో 165fps మోడ్‌కు సపోర్ట్ ఉంది. 8K గేమింగ్ కెమెరా పైప్‌లైన్, లైవ్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధర
చైనాలో iQOO 16 ధరలు ఇలా ఉన్నాయి..
* 12GB + 256GB 5,999 యువాన్లు
* 12GB + 512GB 6,799 యువాన్లు
* 16GB + 512GB 7,499 యువాన్లు
* 16GB + 1TB 8,499 యువాన్లు
iQOO 16 పూర్తి స్పెసిఫికేషన్లు
* డిస్ప్లే: 6.85 అంగుళాల 2K+ Samsung M16 LTPO AMOLED
* రిజల్యూషన్: 3168×1440 పిక్సెల్స్
* రిఫ్రెష్ రేట్: 165Hz
* ప్రాసెసర్: Snapdragon 8 Elite Extreme Gen 6, 2nm
* GPU: Adreno 850
* ర్యామ్: 12GB / 16GB LPDDR5X Ultra
* స్టోరేజ్: 256GB / 512GB / 1TB UFS 4.1
* ఆపరేటింగ్ సిస్టమ్: Android 17, OriginOS 7
* వెనుక కెమెరాలు: 50MP + 50MP అల్ట్రా-వైడ్ + 50MP 3x పెరిస్కోప్
* ఫ్రంట్ కెమెరా: 32MP
* బ్యాటరీ: 8,400mAh
* వైర్డ్ ఛార్జింగ్: 100W
* వైర్లెస్ ఛార్జింగ్: 40W
* సెక్యూరిటీ: ఇన్-డిస్ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* కనెక్టివిటీ: 5G, Wi-Fi 7, Bluetooth 5.4, NFC
* పోర్ట్: USB Type-C 3.2 Gen 1
* వాటర్, డస్ట్ రెసిస్టెన్స్: IP68 + IP69
తాజావార్తలు
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!