165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- ఐకూ పాడ్ అల్ట్రాను ఐకూ 16 స్మార్ట్‌ఫోన్‌తో పాటు చైనాలో లాంచ్
- 8.8 అంగుళాల 2.3K OLED డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్
- 2nm ప్రాసెస్‌పై తయారైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్
- అడ్రినో 850 GPUతో పాటు ప్రత్యేక Q4 గేమింగ్ చిప్
- గేమింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్..
- 9,020mAh భారీ బ్యాటరీతో పాటు 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Pad Ultra Launched: ఐకూ తాజాగా కొత్త iQOO Pad Ultraను అధికారికంగా విడుదల చేసింది. iQOO 16 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ టాబ్లెట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు ఫ్లాగ్షిప్ స్థాయి ప్రాసెసర్, 165Hz OLED డిస్ప్లే, భారీ బ్యాటరీ, ప్రత్యేక యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. ఈ టాబ్లెట్ స్టార్రీ సిల్వర్, ఎండర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
165Hz OLED డిస్ప్లే
iQOO పాడ్ అల్ట్రా కేవలం 5.74 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. ఇందులో 8.8 అంగుళాల 2.3K OLED డిస్ప్లేను అందించారు. సన్నని బెజెల్స్ కారణంగా స్క్రీన్-టు-బాడీ రేషియో 93.3 శాతంగా ఉంది. ఈ డిస్ప్లే 1440×2304 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గరిష్ఠంగా 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. డిస్ప్లే రెస్పాన్స్ టైమ్ 1 మిల్లీసెకన్ కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Also Read
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
టాబ్లెట్ వెనుక భాగంలోని కెమెరా మాడ్యూల్లో RGB లైటింగ్‌ను కూడా అందించారు. ఇది ఆరు రకాల విజువల్ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించేలా కస్టమైజ్ చేసుకోవచ్చు.
ప్రాసెసర్
పనితీరు విషయానికి వస్తే.. ఇందులో 2nm ప్రాసెస్‌పై తయారైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. దీని CPU క్లాక్ స్పీడ్ 5.0GHz వరకు ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం Adreno 850 GPUతో పాటు Q4 గేమింగ్ చిప్‌ను అందించారు. పనితీరును మరింత మెరుగుపరిచేందుకు నెక్స్ట్ జనరేషన్ మాన్స్టర్ ఓవర్ కోర్ ఇంజిన్, ఐకూ సొంత హార్డ్‌వేర్ షెడ్యూలర్ ఉన్నాయి.
యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్
భారీ గేమ్స్, ఎక్కువ పనిభారం సమయంలో టాబ్లెట్ వేడెక్కకుండా ఉండేందుకు ఐకూ ప్రత్యేకమైన “ఐస్ డోమ్ ఫైవ్ ఫోల్డ్ ఎయిర్ కూలింగ్ సిస్టం”ను తీసుకొచ్చింది. ఇందులో 30×30×3.5 మిల్లీమీటర్ల యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 0.94 CFM గాలి ప్రవాహాన్ని అందిస్తుంది. ముందు, సైడ్ ఫ్రేమ్‌లలో 3D ఎయిర్ ఇన్లెట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా టాబ్లెట్‌లోని ఉష్ణోగ్రతను రియల్‌టైమ్‌లో గుర్తించి అవసరానికి అనుగుణంగా గాలి ప్రవాహాన్ని మూడు స్థాయిల్లో ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసే వ్యవస్థను కూడా అందించారు.
గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లు
iQOO పాడ్ అల్ట్రాను ప్రధానంగా గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇందులో రెండు X-యాక్సిస్ లీనియర్ మోటార్లు ఉన్నాయి. ఇవి 4D టాక్టైల్ వైబ్రేషన్‌ను అందిస్తాయి. 15 ప్రముఖ గేమ్స్‌కు నేటివ్‌గా ఈ ఫీచర్‌కు సపోర్ట్ ఉంది. టెన్సెంట్ STAR క్లౌడ్ గేమింగ్ కోసం ప్రత్యేక ఆప్టిమైజేషన్లు ఉన్నాయి. క్లిప్-ఆన్ స్ట్రెచబుల్ గేమ్ప్యాడ్లకు కూడా టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది. మరో ఆసక్తికరమైన ఫీచర్ PC ఎమ్యులేటర్. దీని ద్వారా Steam అకౌంట్‌తో నేరుగా లాగిన్ అయి కొన్ని AAA PC గేమ్స్‌ను టాబ్లెట్‌లో స్థానికంగా రన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సాఫ్ట్వేర్ పరంగా ఆండ్రాయిడ్ 17 ఆధారిత OriginOS 7 HDపై పనిచేస్తుంది. ఇందులో అటామిక్ వర్క్ బెంచ్ వంటి ప్రొడక్టివిటీ టూల్స్‌తో పాటు కస్టమైజ్ చేసుకునే ఫ్లాష్ కార్డ్ UI థీమ్స్ ఉన్నాయి. స్టోరేజ్ కంప్రెషన్ 2.0 ఫీచర్ డేటాను 30% వరకు కంప్రెస్ చేయగలదని కంపెనీ చెబుతోంది. ఐకూ ఎకోసిస్టమ్‌లోని ఇతర అనుకూల పరికరాలతో సులభంగా కనెక్ట్ అయ్యేలా క్రాస్-డివైస్ ఇంటర్‌కనెక్టివిటీని కూడా అందించారు.
9,020mAh బ్యాటరీ
టాబ్లెట్‌కు పవర్ అందించేందుకు 9,020mAh బ్లూ ఓషన్ బ్యాటరీను ఉపయోగించారు. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. పెద్ద బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ కారణంగా ఎక్కువసేపు గేమింగ్ చేసేవారిని లక్ష్యంగా ఈ టాబ్లెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ధర
చైనాలో iQOO Pad Ultra ధరలు ఇలా ఉన్నాయి.
* 12GB + 256GB: 6,499 యువాన్లు,
* 16GB + 256GB: 7,199 యువాన్లు,
* 16GB + 512GB: 7,999 యువాన్లు,
* 16GB + 1TB: 8,999 యువాన్లు.
భారత కరెన్సీలో వీటి ధరలు సుమారుగా రూ.92,965 నుంచి రూ.1,28,725 మధ్య ఉంటాయి. ప్రస్తుతం టాబ్లెట్‌కు ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అధికారిక విక్రయాలు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
iQOO Pad Ultra పూర్తి స్పెసిఫికేషన్లు
* డిస్ప్లే: 8.8 అంగుళాల 2.3K OLED
* రిజల్యూషన్: 1440×2304 పిక్సెల్స్
* రిఫ్రెష్ రేట్: 165Hz
* ప్రాసెసర్: Snapdragon 8 Elite Extreme Gen 6, 2nm
* GPU: Adreno 850
* ర్యామ్: 12GB / 16GB LPDDR5X
* స్టోరేజ్: 256GB / 512GB / 1TB UFS 4.1
* ఆపరేటింగ్ సిస్టమ్: Android 17, OriginOS 7 HD
* వెనుక కెమెరా: 13MP
* ఫ్రంట్ కెమెరా: 8MP
* బ్యాటరీ: 9,020mAh
* ఛార్జింగ్: 66W ఫాస్ట్ ఛార్జింగ్
* స్పీకర్లు: డ్యూయల్ స్పీకర్లు.
iQOO Pad Ultra
• 8.8-inch OLED display
• 5.74mm thin, 298g
• Snapdragon 8 Elite Gen 6
• Built-in active cooling fan
• 14,500 RPM fan speed
• 9,000mAh battery
• Up to 5,000Hz touch sampling
• Dual X-axis linear motors
• Gaming controller and back grip accessories#iQOO pic.twitter.com/lgN1mM0hws— Rock Leaks (@rockleaks) September 20, 2026
తాజావార్తలు
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!