TG Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 30వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది రేషన్ కార్డులు,రైతుభరోసా కోసం కూడా రైతులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి తర్వా రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారనే విధివిధానాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
Read also: KetikaSharma : బర్త్ డే బ్యూటీ కేతిక శర్మ.. కిస్సిక్ ఫొటోస్
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు పొందేందుకు అర్హతలు, విధివిధానాలు, వార్షిక ఆదాయ పరిమితిపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను రేషన్ కార్డుకు అనుసంధానం చేయడంతో రేషన్ కార్డుల జారీ కీలకంగా మారింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులు కావడంతో.. రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.
Read also: Israel: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను చంపింది మేమే..
మరోవైపు తెలంగాణలో గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటికే రైతు భరోసాపై ప్రకటనలు చేసినా.. అందుకు సంబంధించిన విధివిధానాలను ఇంకా ఖరారు చేయలేదు. గత ఏడాది కాలంగా రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా కల్పిస్తామని ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే రైతులకు ఎన్ని ఎకరాల్లో రైతు భరోసా కల్పించాలనే ప్రక్రియపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
Pushpa 2 : సుకుమార్, అల్లు అర్జున్ ని కడిగిపారేస్తానంటున్న గరికపాటి