Pushpa 2 : ప్రస్తుతం పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే బాక్సాఫీసు వద్ద 1500కోట్లకు పైగా కొల్లగొట్టి సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే వివాదాలు కూడా పుష్ప రాజ్ ను వెంటాడుతున్నాయి. సంధ్య థియేటర్ లో ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడంతో ఈ వ్యవహారాన్ని తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది.
Read Also : Sania-Shami: సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి ఫొటోలు వైరల్!
ఇక ప్రధానంగా… ఈ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వడం… అదే రోజు బన్నీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం.. అనంతరం హైదరాబాద్ సీపీ వీడియో ప్రజెంటేషన్ ఇవ్వడం.. ఏసీపీ, సీఐ సవివరంగా వివరించడం వంటి వ్యవహారాలతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. ఇందులో భాగంగా.. ‘పుష్ప’ సినిమా విడుదలైన కొత్తలోదని చెబుతున్న ఈ వీడియో నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో హీరో ఫేమస్ డైలాగ్ “తగ్గేదేలే” అనే దానిపై ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరోమారు తెరపైకి వచ్చాయి.
Read Also :KBR Park: కేబీఆర్ పార్క్‌కు వెళ్లాలంటే నెలకు రూ.1000 కట్టాల్సిందే..
అవును… ‘పుష్ప’ సినిమాలోని “తగ్గేదేలే” అనే డైలాగ్ పై గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. “స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే లే అంటాడా.. రేపు ఏ పిల్లవాడు ఎవరినైనా కొట్టి తగ్గేదేలే అంటాడు.. దానికి ఎవరు కారణం..? ఆ సినిమా డైరెక్టర్, హీరో కనబడితే కడిగిపారేస్తాను” అని గరికపాటి మండిపడ్డారు. ఇదే సమయంలో… తగ్గేదేలే అని ఒక హరిశ్చంద్రుడు, శ్రీరామ చంద్రుడు వంటి వారు అనాలి కానీ.. ఓ స్మగ్లర్ అనడం ఏమిటి? అంటూ గరికపాటి నరసింహారావు ఫైర్ అయ్యారు! ఈ వీడియో ఎప్పటిదో అయినప్పటికీ… తాజా పరిణామాల నేపథ్యంలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.