Vikarabad hidden treasures: వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తన్ పూర్ తాండాలో దారుణం చోటుచేసుకుంది. గుప్త నిధులు తొవ్వకాలు జరుపుతున్నారంటు భూ యజమాని, పూజ చేసేందుకు వచ్చిన వారిపై దాడిచేసారు తాండా వాసులు. గుప్త నిధులు తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారంతో.. గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. భూయజమాని, పూజ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు రాగా.. తవ్వకాలు జరపకూడదని వాదించారు. దీంతో వారివురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటలు తారాస్థాయికి చేరాయి.
దీంతో తాండావాసులు రూప్ల నాయక్, శంకర్ నాయక్, సీతారాం నాయక్, సీను నాయక్, మోహన్ నాయక్, తీవ్ర్య నాయక్ లు కలిసి భూయజమాని, మరో ఇద్దరిపై దాడి చేసారు. అడ్డొచ్చిన భూయజమాని కుటుంబాన్ని సైతం చితకబాదారు. పూజా స్థలంలో సామాగ్రిని, ద్వంసం చేసారు. స్థానిక సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దాడిచేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పూజా స్థలంలో సామాగ్రిని, ద్వంసం అయిన రెండు బైకులను కారుని స్వాదీనం చేసుకున్నారు. దాడిలో గాయపడిన వాళ్లని మెరుగైన చికిత్స కోసం నగర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Woman Marries 6 times: ఏడో పెళ్లికి రెడీ.. అడ్డంగా బుక్కైన నిత్యపెళ్ళికూతురు