మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పరమ పవిత్రమైన కీసరగుట్ట శ్రీభవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న లింగాలకుంటలో కొందరు గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం త్రవ్వకాలు చేపట్టిన ఆనవాళ్లు కనిపించాయి. స్వామివారి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న లింగానికి పూజలు చేసి గుప్త నిధుల కోసం కొన్ని అడుగుల మేరకు త్రవ్వకాలు జరిపారు. గుప్తనిధుల కోసం త్రవ్వకాలు జరిపారనే ఆనవాళ్లుగా అక్కడే ఓ మట్టికుండ, ఎర్రని గుడ్డ, పసుపు, నీళ్ళ బాటిల్ కనిపించడం పలు…
శ్రీహేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయం పరిసరాల్లో కొంత కాలంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన పది మంది ముఠాను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గుట్టపై కొంత కాలంగా అటవీ అభివృద్ధి పనులు చేస్తున్న ఓ ఫారెస్ట్ అధికారితో పాటు అతని సహాయకునిగా పనిచేస్తున్న మల్లూరుకు చెందిన వ్యక్తి, తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన మరో వ్యక్తి, జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన పది మంది ముఠాగా ఏర్పడి గుట్టపై గుప్తనిధుల కోసం…