గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా హడలెత్తించిన ఎండలు ఇప్పుడు కొద్దిగా శాంతించాయి. వేడి గాలులు తగ్గుమొఖం పట్టాయి. రెండు, మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి.
Rain Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది.