Hookah Centre: ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే హుక్కా సెంటర్లను తెలంగాణ ప్రభుత్వం గతంలో నిషేధించినా పలు చోట్ల కొనసాగుతున్నాయి. నగరాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బార్లలో మైనర్లకు పొగాకు సులభంగా అందుబాటులో ఉంటుంది. 14-15 హుక్కా తాగుతు మత్తులో తూగుతున్నారు. కాలక్షేపంగా భావించిన హుక్కా ధూమపానం త్వరగా అలవాటుగా, ఆపై వ్యసనంగా మారుతుంది. అటు మద్యం, ఇటు హుక్కాకు అలవాటుపడుతున్న యువతకు అధికారులు ఎన్ని కౌన్సిలింగ్ లు ఇచ్చినా అదుపుచేయలేకపోతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా స్పా, కేఫ్, ముసుగులో హుక్కా సెంటర్లు నడుపుతున్నారు. దీనిపై పోలీసులు నిఘాపెట్టారు. పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు కేఫ్ సెంటర్‌లో దాడులు చేయడంతో అసలు బండారం బయటకు వచ్చింది. కేఫ్ ముసుగులో హుక్కా సెంటర్ నడుతున్నవారిని అదుపులో తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన మెహదీపట్నంలో చోటుచేసుకుంది.
Read also: Anu Gowda: నటి అనుగౌడపై దాడి.. రక్తం వచ్చేలా కొట్టారు
హైదరాబాద్ మెహదీపట్నంలో కేఫ్ ముసుగులో హుక్కా సెంటర్ నడుపుతున్నారని సమాచారం రావడంతో వెస్ట్ జోన్ CCS పోలీసుల దాడులు చేశారు. కేఫ్ సెంటర్ లో భారీగా హుక్కా గుర్తించారు. హుక్కా పీలుస్తున్న యువతను రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. నిర్వాహకుడితో పాటు ముగ్గురుని అదుపులోకి తీసుకొని ఆసిఫ్ నగర్ పోలీసులకు అప్పగించారు క్యాప్స్. కేఫ్ సెంటర్ లో భారీగా హుక్కా, వివిధ రకాల హుక్క ప్లేవర్స్, పాట్స్ సీజ్ చేశారు. COTP యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా యువకులే కావడం విషేశం. కేఫ్ ముసుగులు హుక్కా దందా నడుపుతున్న వారిపై కేసు నమోదు చేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామాని తెలిపారు. స్పా, కేఫ్, రెస్టారెంట్ అంటూ పేర్లు పెట్టి హుక్కా సెంటర్లు నడుపుతున్నట్లు సమాచారాలు అందుతున్నాయని తెలిపారు. ఎవరైనా, ఎంతటి వారైనా నేరస్తులుగా పరిగణించి చర్యలు తీసుకుంటామని ఆసిఫ్ నగర్ పోలీసులు తెలిపారు.
NEET Case: నీట్ కేసులో మరో మెడికల్ విద్యార్థి అరెస్ట్