Alcohol: ఇప్పుడున్న కాలంలో మద్యపానం వినియోగం అనేది చాలా పెరిగింది. చాలా మంది ఆల్కహాల్ తాగుతున్నారు. ఆల్కాహాల్ తాగడం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. యువత నుంచి వృద్ధుల దాకా ఆల్కాహాలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆల్కాహాల్ తీసుకోవడం ఉంటే పర్వాలేదు కానీ.. ప్రతీ రోజు తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లివర్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
Read Also: NCP Crisis: పవార్ వర్సెస్ పవార్.. పోటాపోటీగా విప్ జారీ చేసిన రెండు వర్గాలు..
క్రమం తప్పకుండా మద్యం తీసుకోవడం వల్ల ‘లివర్ సిర్రోసిస్’ వంటి వ్యాధుల వస్తాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన 2019 అధ్యయనం ప్రకారం, తక్కువ మద్యపానం వల్ల పురుషులతో పోలిస్తే మహిళల్లో కూడా కాలేయ వ్యాదులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. సాధారణంగా ఆల్కహాల్ తీసుకోనే కొత్తలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను చూడొచ్చు. పొత్తి కడుపు పై భాగంలో నొప్పి వస్తుంది. ఆ తరువాత రక్తపోటు(బీపీ)ని ప్రభావితం చేస్తుంది. అధిక మద్యపానం ప్రాంక్రియాస్ పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
కాలేయం ముఖ్యవిధి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. మనం తాగే మద్యాన్ని విచ్చిన్నం చేయడంలో సహాయపడుతుంది. అయితే క్రమం తప్పకుండా ప్రతీ రోజూ మద్యం తాగితే ఇది లివర్ పై భారాన్ని వేస్తుంది. దీంతో లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్, హెపటైటిస్, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్ వంటి ప్రమాదకర పరిస్థితులకు దారి తీసుంది. మితంగా తాగడం కూడా కాలేయంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మద్యం తాగే అలవాటు ఉన్నవారు క్రమంగా లివర్ పనితీరును పర్యవేక్షించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.