Harish Rao : రేవంత్ హామీలు గాలిమాటలే
- గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు.. హరీశ్ రావు తీవ్ర ఆవేదన
- కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు బకాయి
- కేసీఆర్ హయాంలో ఆదర్శం.. కాంగ్రెస్ పాలనలో అధఃపాతం
- గురుకుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రాష్ట్రంలోని గురుకుల విద్యావ్యవస్థపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గురుకులాల్లో పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారిందని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు ప్రకారం, గురుకులాల్లో విద్యార్థులు విషజ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి కారణాలతో ఆసుపత్రుల పాలవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.
అదేవిధంగా, గురుకులాల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. “ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆడంబర ప్రకటనలు చేసే ముందు, వారికి సకాలంలో జీతాలు చెల్లించాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన హామీలు వాస్తవంలో నీటి మూటలయ్యాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Also Read
- CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
- OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
- OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
- KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
Visakhapatnam : విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ప్రమాదం
“కల్తీ ఆహారం పెడితే జైలుకే పంపిస్తామని ఇచ్చిన ప్రకటనలు కూడా అమలు కావడంలేదు” అని ఆయన విమర్శించారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యావ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఆ సమయంలో 294 గురుకులాలను 1,024కి పెంచిన ఘనత కేసీఆర్ ది అని హరీశ్ రావు గుర్తుచేశారు. అలాగే, విద్యార్థుల సంఖ్యను 1.90 లక్షల నుంచి 6.5 లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను అందించారని చెప్పారు.
“కానీ కాంగ్రెస్ పాలనలో 22 నెలల్లోనే గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారింది” అని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి గురుకులాలపై చిన్న చూపు చూపడం ఆపాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, గురుకుల విద్యా వ్యవస్థకు శ్రద్ధ వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
PM Modi: జాతి ఘర్షణల తర్వాత, తొలిసారి మణిపూర్‌కు ప్రధాని మోడీ.!
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!