Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- యాదాద్రి థర్మల్ ప్లాంట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష
- బొగ్గు సరఫరా సమస్యపై అధికారులతో సుదీర్ఘ చర్చ
- నైనీ గనుల నుంచి బొగ్గు సరఫరా పెంపుపై చర్యలు
- దసరాకల్లా పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తికి ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడంపై సమీక్షించిన సీఎం, డిప్యూటీ సీఎంలు అధికారులను తీవ్రంగా ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు, బొగ్గు లభ్యత , ప్లాంట్ నిర్మాణంలోని లోపాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
జీ-9 బొగ్గు లభించకున్నా నిర్మించడమేంటి? ₹40 వేల కోట్ల అదనపు భారం
యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే జీ-9 కేటగిరీకి చెందిన బొగ్గు అత్యంత ఆవశ్యకమని అధికారులు సీఎం, డిప్యూటీ సీఎంలకు వివరించారు. అయితే సింగరేణిలో జీ-9 రకం బొగ్గును ఉత్పత్తి చేసే బ్లాకులు ప్రస్తుతం లేవని, సమీప భవిష్యత్తులోనూ సింగరేణి నుంచి ఈ రకం బొగ్గు లభించే అవకాశం లేదని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, స్థానికంగా జీ-9 బొగ్గు లభ్యత లేనప్పుడు అదే సాంకేతికతతో యాదాద్రి ప్లాంట్‌ను ఎందుకు నిర్మించారని నిలదీశారు. అంతేకాకుండా బొగ్గు గనుల సమీపంలో (పిట్ హెడ్) కాకుండా కేవలం రాజకీయ కారణాలతో విద్యుత్ కేంద్రాన్ని దూరంగా నిర్మించడం వల్ల, బొగ్గు రవాణా నిమిత్తం రాష్ట్రంపై ఏకంగా రూ. 40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని అధికారులు వెల్లడించడంతో నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Also Read
- WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
- Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
- Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
- Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూతపడిన 14 బొగ్గు బ్లాకులు
సింగరేణి నుంచి జీ-9 బొగ్గు ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై ప్రభుత్వం ఆరా తీయగా, గత పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ఇందుకు కారణమని అధికారులు తేల్చిచెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు బ్లాకుల వేలంలో నాటి ప్రభుత్వం పాల్గొనకపోవడం వల్లే సింగరేణి జీ-9 బొగ్గును సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ముందస్తు ప్రణాళికలు, చొరవ లేకపోవడం వల్ల సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు పూర్తిగా మూతపడ్డాయని అధికారులు సమీక్షా సమావేశంలో సవివరంగా తెలియజేశారు.
కేంద్రమంత్రితో చర్చలు.. దసరాకల్లా పూర్తిస్థాయి ఉత్పత్తికి ఆదేశాలు
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, బొగ్గు కొరతను జయించడానికి మహానది కోల్ ఫీల్డ్స్ , కోల్ ఇండియా నుంచి వెంటనే బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ విషయమై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సత్వరమే మాట్లాడి బొగ్గు సరఫరా సమస్యను పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సీఎం సూచించారు. ఇక ఎలాంటి ఆలస్యం జరగకుండా వచ్చే దసరా పండుగ నాటికి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులకు స్పష్టమైన గడువు విధించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!