AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Severe Depression Landfall: తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకడం ప్రారంభించింది. కళింగపట్నానికి నైరుతి సమీపంలో ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. మరో రెండు గంటల్లో తీవ్ర వాయుగుండం పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం తీరానికి తుపాన్ చేరువ కావడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తీవ్ర వాయుగుండం వజ్రపుకొత్తూరు–భోగాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.. అయితే, కళింగపట్నానికి నైరుతి సమీపంలో ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.. తీర ప్రాంతాల్లో గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం కోరింది. ఇక, తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ రాత్రి శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖపట్నం జిల్లాలో కూడా భారీ వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విశాఖపట్నం ప్రాంతంలో గంటకు 60–75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
గుంటూరు, పల్నాడులో మోస్తరు వర్షాలు
రానున్న మూడు గంటల్లో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆయా ప్రాంతాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!