Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
- షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన
- ట్రంప్‌తో కీలక చర్చలు, స్టేట్ డిన్నర్‌కు భారీ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping Arrives in America: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన భార్య పెంగ్ లియువాన్‌తో కలిసి అమెరికాకు చేరుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత షీ జిన్‌పింగ్ అమెరికా గడ్డపై అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంప్రదాయ ప్రోటోకాల్‌కు భిన్నంగా స్వయంగా స్వాగతం పలికారు. సాధారణంగా విదేశీ దేశాధినేతలకు వైట్‌హౌస్‌లో స్వాగతం పలికే అమెరికా అధ్యక్షుడు.. ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. ట్రంప్‌తో పాటు ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కూడా అక్కడికి చేరుకుని షీ జిన్‌పింగ్ దంపతులకు స్వాగతం పలికారు.
కీలక అంశాలపై చర్చ
అమెరికా-చైనా మధ్య వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇరాన్‌తో యుద్ధం, తైవాన్ తదితర అంశాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం వైట్‌హౌస్‌లో షీ జిన్‌పింగ్‌కు అధికారిక స్వాగత కార్యక్రమం జరగనుంది. అనంతరం సైనిక దళాల పరేడ్‌ను పరిశీలించిన తర్వాత ట్రంప్, జిన్‌పింగ్‌లు కీలక అంశాలపై ముఖాముఖి చర్చలు జరపనున్నారు. శుక్రవారం ఇద్దరు నేతలు నేషనల్ ఆర్కైవ్స్‌ను సందర్శించనున్నట్లు సమాచారం.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
షీ జిన్‌పింగ్ కోసం స్టేట్ డిన్నర్
షీ జిన్‌పింగ్ గౌరవార్థం వైట్‌హౌస్‌లో ప్రత్యేక స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు టెక్నాలజీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. షీ జిన్‌పింగ్‌కు స్వాగతం పలికిన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. చైనా అధ్యక్షుడి కోసం ఏర్పాటు చేస్తున్న స్టేట్ డిన్నర్‌కు టెక్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. తమ వద్ద మరిన్ని సీట్లు ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఇరాన్ అంశంపై జిన్‌పింగ్‌తో చర్చిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ఇరాన్‌తో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చిస్తానని ట్రంప్ తెలిపారు.
అమెరికాలో షీ పర్యటనపై విమర్శలు
షీ జిన్‌పింగ్‌కు అమెరికా ఇచ్చిన ఘన స్వాగతంపై దేశీయంగా కొన్ని విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అమెరికా సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సెనేటర్ రోజర్ వికర్.. చైనా, షీ జిన్‌పింగ్‌తో అమెరికాకు ఉన్న తీవ్రమైన విభేదాలను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ఆయనను ఆహ్వానించాల్సి ఉందా అనే అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. స్టేట్ డిన్నర్ సందర్భంగా చైనా సైనిక విస్తరణ, ఇరాన్‌కు చైనా మద్దతు వంటి అంశాలను ట్రంప్ ప్రస్తావించాలని వికర్ సూచించారు. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ పర్యటనను సమర్థించారు. అమెరికా, చైనా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రధాన సైనిక శక్తులు కావడంతో.. ఉన్నత స్థాయిలో ఇరు దేశాల మధ్య సంభాషణ కొనసాగించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
కొత్త హెలీప్యాడ్‌తో ఆకట్టుకోవాలనుకున్న ట్రంప్
షీ జిన్‌పింగ్ పర్యటనకు ముందు ట్రంప్ తన కొత్త హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్ గురించి కూడా ప్రస్తావించారు. షీ జిన్‌పింగ్‌ను కొత్త హెలీప్యాడ్‌తో ఆకట్టుకోవాలని తాను భావిస్తున్నట్లు ట్రంప్ గతంలో పేర్కొన్నారు. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కూడా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. చైనా అధ్యక్షుడు అమెరికాకు వస్తున్నందున ఆయనకు తగిన గౌరవంతో స్వాగతం పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమెరికా-చైనా సంబంధాల్లో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, తైవాన్, ఇరాన్ వంటి అనేక కీలక అంశాలు చర్చకు వస్తున్న నేపథ్యంలో షీ జిన్‌పింగ్ మూడు రోజుల అమెరికా పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
Chinese President Xi arrived in the USA to a grand welcome. The USA president received him, breaking the protocol. pic.twitter.com/5eCp6ULRz9
— Sagar STORM🔳 (@AlexAllone1) September 24, 2026
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!