Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Schools Holiday: తీవ్ర వాయుగుండం తీరం దాటింది.. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నలం సమీపంలో తీరం దాటింది.. ఇక, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో సహాయక, రక్షణ చర్యలను ముమ్మరం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 24న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఎన్టీఆర్ జిల్లాలోనూ విద్యాసంస్థలకు సెలవు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెప్టెంబర్ 24న ఒక రోజు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు రాకపోకలు సాగించే సమయంలో అసౌకర్యం లేదా ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
విజయనగరంలో పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెప్టెంబర్ 24న సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి నిర్ణయం మేరకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవు ప్రకటించినట్లు ఐసీడీఎస్ పీడీ కె.వి. బాలమణి తెలిపారు. విద్యార్థులు, చిన్నారులు వర్షాల సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
విశాఖలో వర్షాల ప్రభావం.. 41 చోట్ల చెట్ల తొలగింపు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖ నగరంలోనూ భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. నగరంలోని 41 ప్రాంతాల్లో కూలిన చెట్లను జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. యూజీడీ ఓవర్ఫ్లో, నీరు నిలిచిపోవడం వంటి ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 56 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. కూలిపోయే ప్రమాదమున్న చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, పాత భవనాలు, గోడలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వర్షపు నీరు ప్రవహించే కాలువలు, గెడ్డలు, లోతట్టు ప్రాంతాలు, ఇతర ప్రమాదకర ప్రదేశాల వద్దకు వెళ్లవద్దని సూచించారు.
విశాఖ మధురవాడ కొమ్మాది ప్రాంతంలోని రికాన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. సెల్లార్ మొత్తం నీటితో నిండిపోవడంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సహాయక బృందాలు అపార్ట్మెంట్లో చిక్కుకున్న సుమారు 70 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. అనంతరం వారందరికీ సమీపంలోని మరో అపార్ట్మెంట్లో సురక్షితంగా ఆశ్రయం కల్పించారు.
శ్రీకాకుళంలో పంటలకు నష్టం
తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పోలాకి, సంతబొమ్మాళి, నందిగాం మండలాల్లో పంట పొలాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. అరటి తోటలు, మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా నష్టం వాటిల్లింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..