IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- OPPO Find X10, OPPO Find X10 E రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్
- రెండు ఫోన్లలో IP66 + IP68 + IP69 రేటింగ్స్
- Find X10లో 200MP మెయిన్ + 200MP పెరిస్కోప్ టెలిఫొటో + 50MP అల్ట్రా-వైడ్ కెమెరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Find X10: ఒప్పో (OPPO) నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లోకి మరో రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. OPPO Find X10, OPPO Find X10 E పేర్లతో ఈ రెండు మోడళ్లను అధికారికంగా ప్రకటించింది. అధిక సామర్థ్యం కలిగిన సిలికాన్-కార్బన్ బ్యాటరీలు, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు, హ్యాస్‌ల్‌బ్లాడ్ ట్యూన్డ్ కెమెరాలు ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
OPPO Find X10..
స్టాండర్డ్ Find X10లో MediaTek Dimensity 9600M ప్రాసెసర్‌ను అందించారు. 3nm ప్రాసెస్‌పై తయారైన ఈ చిప్సెట్ గరిష్ఠంగా 4.21GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. ఎక్కువసేపు గేమింగ్, ఇతర పనులు చేసినా ఫ్రేమ్రేట్లు స్థిరంగా ఉండేలా ఓపో కొత్త Tide Engineను ఉపయోగించింది. ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత ColorOS 17తో పనిచేస్తుంది. ఇందులో AI ఆధారిత ప్రొడక్టివిటీ టూల్స్, Fluid Cloudలో ట్రాన్సిట్ అరైవల్ రిమైండర్లు ఉన్నాయి.
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
ఇందులో 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను అందించారు. 2760×1256 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌తో పాటు కేవలం 1 నిట్ వరకు బ్రైట్నెస్ను తగ్గించుకునే సదుపాయం ఉంది. స్క్రీన్ చుట్టూ 0.99mm అల్ట్రా-నారో బెజెల్స్‌ను అందించారు.
కెమెరాల విషయానికి వస్తే Find X10లో హ్యాస్‌ల్‌బ్లాడ్ Ultra HD Original Camera సిస్టమ్‌ను అందించారు. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 200MP మెయిన్ కెమెరాకు 1/1.4 అంగుళాల సెన్సార్, ఎఫ్/1.6 అపెర్చర్, OIS సపోర్ట్ ఉన్నాయి. 200MP పెరిస్కోప్ కెమెరా 2.8x ఆప్టికల్ జూమ్, 1/1.56 అంగుళాల సెన్సార్, ఎఫ్/2.6 అపెర్చర్‌తో వస్తుంది.
అల్ట్రా-వైడ్ కెమెరా 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను అందిస్తుంది. LUMO నేటివ్ లైట్ అండ్ షాడో ఇంజిన్ ద్వారా ఒక్క ఫ్రేమ్‌లో 17 స్టాప్స్ డైనమిక్ రేంజ్‌ను అందించేలా కెమెరా వ్యవస్థను రూపొందించారు. హ్యాస్‌ల్‌బ్లాడ్ పోర్ట్రెయిట్ మోడ్‌తో పాటు ప్రత్యేక టెలికన్వర్టర్ కిట్‌కు కూడా సపోర్ట్ ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఉపయోగించారు. దీనికి 80W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. IP66, IP68, IP69 రేటింగ్స్‌తో నీరు, దుమ్ము నుంచి రక్షణ కల్పించారు. ఈ మొబైల్ 12GB+256GB వేరియంట్ ధర 5,499 యువాన్లు (సుమారు రూ.78,510)గా ఉంది. 12GB+512GB ధర 5,999 యువాన్లు (సుమారు రూ.85,650), 16GB+512GB ధర 6,499 యువాన్లు (సుమారు రూ.92,790), 16GB+1TB వేరియంట్ ధర 7,499 యువాన్లు (సుమారు రూ.1,07,070)గా నిర్ణయించారు.
OPPO Find X10 E..
Find X10తో పాటు ఓపో Find X10 Eని కూడా పరిచయం చేసింది ఒప్పో. ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ 6.59 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఐస్ బ్లూ, లైట్ టైటానియం రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్లో MediaTek Dimensity 9500s 3nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 12GB/16GB LPDDR5X RAM, 256GB/512GB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. Android 17 ఆధారిత ColorOS 17తో పనిచేస్తుంది.
ఇందులో కెమెరాల విషయానికి వస్తే Find X10 Eలో వెనుకవైపు మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. 1/1.4 అంగుళాల సెన్సార్, ఎఫ్/1.6 అపెర్చర్, OISతో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫొటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. హ్యాస్‌ల్‌బ్లాడ్ Natural Colors, Professional Portrait Mode, XPAN Mode వంటి ఫీచర్లు అందించారు. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
Find X10 Eలో 7025mAh బ్యాటరీ ఉంది. దీనికి 80W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 6.59 అంగుళాల 120Hz AMOLED డిస్ప్లే, 3840Hz PWM డిమ్మింగ్, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ కూడా IP66, IP68, IP69 రేటింగ్స్‌తో వస్తుంది. చైనాలో OPPO Find X10 E 12GB+256GB వేరియంట్ ధర 4,999 యువాన్లు (సుమారు రూ.71,370)గా ఉంది. 16GB+512GB వేరియంట్ ధర 5,499 యువాన్లు (సుమారు రూ.78,510). ఇక రెండు ఫోన్ల అమ్మకాలు చైనాలో సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..