హైదరాబాద్ లోని నిమ్స్ లో రేడియాలజి విభాగంలో పనిచేస్తున్న యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆ విభాగములోని ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యుల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి చెందిన దువ్వసి సరస్వతిగా గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇక వివరాల్లో వెలితే.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కి చెందిన తండ్రి యాదయ్యకు ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి సరస్వతి, సాయికిరణ్ అనే ఇద్దరు పిల్లలు. ఉద్యోగ రీత్యా సరస్వతి హైదరాబాద్ లోని పంజాగుట్టలోని బాలాపూర్ బస్తి లో నివాసం ఉంటోంది. నిమ్స్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్, నిమ్స్ రేడియాలజి విభాగంలో పనిచేస్తుంది. అర్థరాత్రి తన ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతిరాలి తమ్ముడు సాయికిరణ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిమ్స్ హాస్పిటల్లో విధుల వ్యవహారంలో మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే తన సోదరి సరస్వతి ఆత్మహత్య చేసుకుందని సాయికిరణ్ ఆరోపించాడు. తన సోదరి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరాడు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరస్వతి మానసిన ఒత్తిడి వల్లే ఆ ఘాతుకానికి పాల్పడిందా లేదా ఇతర కారణావల్ల ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Bhumana Karunakar Reddy : ప్రతి ఇంటి నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది