హైదరాబాద్ లోని నిమ్స్ లో రేడియాలజి విభాగంలో పనిచేస్తున్న యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆ విభాగములోని ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యుల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి చెందిన దువ్వసి సరస్వతిగా గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక వివరాల్లో వెలితే.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కి చెందిన తండ్రి యాదయ్యకు ఆర్టీసీ డ్రైవర్…