Gold-Silver Price: పసిడి, వెండి, ప్లాటినంతో సహా అలంకార లోహాల ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకార లోహాల రేట్లను పెంచడానికి లేదా తగ్గించడానికి అనేక అంశాలు పని చేస్తాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం అనేక ప్రాంతాలను ప్రభావితం చేసింది. ఆ ప్రభావంతో గత నెలరోజులుగా ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే.. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు పెరగడం లేదా తగ్గడం, వివిధ ఆభరణాల మార్కెట్లలో వినియోగదారుల నుంచి డిమాండ్ హెచ్చుతగ్గులు వంటి అనేక అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం-వెండి ధరలు:
తెలంగాణలో బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 52,250కి చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 57,060. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 74,300. ఏపీ, తెలంగాణ అంతటా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లో బంగారం-వెండి ధరలు
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర ₹ 52,250కి చేరుకుంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 57,060గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,300. విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం మరియు వెండికి విజయవాడ మార్కెట్ రేటు అమలవుతోంది.
పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో బంగారం ధరలు మరింతగా పెరుగనున్నాయి. బంగారం ధరలు సామాన్యులకు కష్టాలు తప్పేట్లు లేవు. కొనుగోలు చేయాలనుకున్న బంగారంలో సగం మాత్రమే కొంటున్నారు. మరో వైపు కొనుగోల్ళు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవంటున్నారు గోల్డ్ అనలిస్ట్ లు. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. కుటుంబ సభ్యులు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. మరి ఇప్పట్లో బంగారం తగ్గేలా లేదు. పసిడి కొండెక్కడంతో బంగారం షాపులు ఎక్కడ చూసిన ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.
TSPSC AEE Exam: నేడే ఏఈఈ రాతపరీక్ష.. అభ్యర్థులకు ముఖ్య సూచనలివే..