TSPSC AEE Exam: నేడే ఏఈఈ రాతపరీక్ష.. అభ్యర్థులకు ముఖ్య సూచనలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC AEE Exam: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నేడు రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏడు జిల్లాల్లోని 176 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష OMR విధానంలో మాత్రమే నిర్వహించబడుతుంది. పేపర్-1 పరీక్ష 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
Read also: Nampally Fire Accident: నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
పేపర్-1 పరీక్షకు ఉదయం 8.30 నుంచి 9.45 గంటల వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. గేట్లు మూసివేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశానికి అనుమతి లేదు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో.. పేపర్-2 ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఇప్పటికే హాల్ టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
విధానం:
మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) 150 మార్కులు, పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్ట్) 300 మార్కులు. పేపర్-1లో 150 మార్కులకు 150 ప్రశ్నలు, పేపర్-2లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల పరీక్ష సమయం కేటాయించారు.
అభ్యర్థులకు సూచనలు..
* పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పేపర్-1కి ఉదయం 8.30 నుంచి 9.45 వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. అంటే అభ్యర్థులు పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు పరీక్ష హాలులో ఉంటారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు.
* పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
* పరీక్షా కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను అనుమతించరు. ఎవరైనా అభ్యర్థులు దీనిని తీసుకుంటే వారు డిబార్ చేయబడతారు.
* అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన పరీక్ష నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. వాటిని అనుసరించాలి.
* చివరి నిమిషంలో పరీక్షా కేంద్రం ఎక్కడుందో వెతకడం కంటే ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.
* హాల్‌టికెట్‌పై ఫోటో స్పష్టంగా లేని, ఫోటో చిన్నదిగా ఉన్న, ఫోటో లేకుండా, సంతకం లేని అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నప్పుడు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి. గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్‌తోపాటు అండర్‌టేకింగ్ తీసుకోవాలి. పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు సమర్పించాలి. లేకుంటే పరీక్షకు అనుమతించరు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!