పంజాగుట్టలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకపురి కాలనీ నాలుగు సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఓ షట్టర్ ముందు నాలుగు సంవత్సరాల అమ్మాయి అనుమానాస్పదంగా మరణించింది. ఆ అమ్మాయిని ఎవరైనా చంపేసి ఇక్కడ పెట్టారా లేక ఇంకేమైనా కారణాలు అనేది తెలియాల్సి ఉంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు క్లూస్ టీం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల అమ్మాయి బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.